ఆషాడంలో కొత్త జంట కలిసి ఉండకూడదని అంటారు.. ఎందుకో తెలుసా?

Why new couple will not live in same house in Ashada Masam

03:33 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Why new couple will not live in same house in Ashada Masam

మన సంస్కృతి, సంప్రదాయంలో ముఖ్యంగా ఆచారాల్లో శాస్త్రీయత కూడా జోడించి ఉంటుంది. అయితే మన పూర్వీకులు మనకు పెట్టిన ఆచారాలను ఇప్పుడు కాలం మారిందనే నెపంతో తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయా సాంప్రదాయాల్లో నిగూడంగా ఎంతో పరమార్థం దాగివుంది. అందులో ఒకటి ఆషాడం... అవును ఆషాఢం రాగానే కొత్తగా పెళ్లయిన అమ్మాయి పుట్టింటికి చేరిపోతుంది. పెళ్లయిన తర్వాత వచ్చే తొలి ఆషాడ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో ఉండరాదనే నియమం ఉంది. ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకే గడప దాటకూడదనేది మన తెలుగువారి ఆచారం. సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ఆచారంలో పలు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

1/4 Pages

కొత్తగా పెళ్లయిన జంట..

కొత్తగా పెళ్లయిన జంట ఈ నెలలో కలిసివున్న కారణంగా గర్భం వస్తే బిడ్డ పుట్టేప్పటికి చైత్ర, వైశాఖ మాసాలొస్తాయి. అంటే అది ఎండాకాలం అన్నమాట. భగ భగ మండే ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారన్నది ఇందులోని శాస్త్రీయత. కానీ ఈ ఆరోగ్య రహస్యం చెప్పకపోవడం వలన వేరే అర్ధాలు తీసుకుని, యథేచ్ఛగా కల్సి వుంటున్నారు. పైగా ఆ నెల్లాళ్లూ అత్తగారు రాకుండా చూసుకుంటున్నారు.

English summary

Why new couple will not live in same house in Ashada Masam