మెడల్ ని పంటితో ఎందుకు కోరుకుతారో తెలుసా?

Why Olympians Bite Their Medals

11:44 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Why Olympians Bite Their Medals

క్రీడా పండుగ జరుగుతుంటే ఒకటే సందడి. అందునా అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు అయితే చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని అనేక దేశాల క్రీడాకారులు పాల్గొనే వేదిక కనుక భలే మజాగా ఉంటుంది. ఇక తాజాగా రియోలో ఒలంపిక్స్ జరిగాయి కదా. గెలిచిన దేశాల వేడుకలకు, ఓడిన దేశ క్రీడాకారుల ఉద్విగ క్షణాలకు నెలవైన గొప్ప సంరంభమే ఒలింపిక్స్ క్రీడలు. మరి ఇంతమంది క్రీడాకారులు ఆడి, పోరాడి గెలిచే ఒలింపిక్స్ లో వారు ఆ వేదికపై ఏది చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది.

1/4 Pages

చాలామంది క్రీడాకారులు మెడల్ గెలుచుకోగానే దాన్ని ముద్దు పెట్టుకుని ఫోటోలకు పోజులిస్తుంటారు. దీంతో పాటు వారు సాధించిన మెడల్ ను పంటితో కొరికి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే క్రీడాకారులు పతకాన్ని గెలుచుకోగానే ఎందుకు కొరుతారని తెలుసుకోవాలనే ఆత్రుత చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు కొందరు చెబుతున్న సమాధానమిది.

English summary

Here are the reason behind Olympians Bite Their Medals.