ఆ కోటను క్వీన్ ఎలిజబెత్ ఎందుకు వదిలేసింది?

Why Queen Elizabeth left that palace

12:16 PM ON 19th November, 2016 By Mirchi Vilas

Why Queen Elizabeth left that palace

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తాను నివాసం ఉంటున్న ప్రఖ్యాత కట్టడం బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారట. ఇంతకీ ఎందుకంటారా, అత్యంత పురాతనమైన ఈ కట్టడాన్ని దాదాపు మూడువేల కోట్ల రూపాయల(369 మిలియన్ పౌండ్లు)తో ఆధునికీకరించడానికి నిర్ణయించడమే దీనికి కారణం. ఆధునీకీకరణ గురించి బ్రిటన్ ట్రెజరీ శుక్రవారం ప్రకటించింది. ప్యాలస్ ఆధునికీకరణ పూర్తయ్యే వరకు 90 ఏళ్ల రాణి వేరే బిల్డింగ్లో ఉండనున్నారు. రాణి ఉండేందుకు తీర్చిదిద్దుతున్న నివాసం ఏప్రిల్, 2017లో పూర్తికానుంది.

1/5 Pages

1. ఇక ప్రపంచంలోని చారిత్రక భవనాల్లో బకింగ్ హ్యామ్ ప్యాలెస్ కూడా ఒకటి. పూర్తిగా పాతబడిన ఈ కట్టడం జీవితకాలాన్ని మరో 50 ఏళ్లపాటు అంటే 2067 వరకు పొడిగించాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్టర్ ఆఫ్ ది క్వీన్స్ హౌస్ హోల్డ్ టోనీ జాన్ స్టోన్-బర్ట్ తెలిపారు.

English summary

Why Queen Elizabeth left that palace