ఆ కమీడియన్ రాజమౌళికి ఎందుకు?

Why Rajamouli wants that comedian

10:14 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Why Rajamouli wants that comedian

తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలైనా సరైన అవకాశాలు రాక టాలీవుడ్‌లో నిలదోక్కుకోలేక పోయాడు కమీడియన్‌ 30 ఇయర్స్‌ పృధ్వీ. 'ఖడ్గం' చిత్రంలో '30 ఇయర్స్‌ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌తో పాపులర్‌ అయిన పృధ్వీ ఆ తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రాలేదు. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ దాదాపు 10 సంవత్సరాలు నెట్టుకొచ్చాడు. అయితే 2014 లో గోపీచంద్ నటించిన 'లౌక్యం' చిత్రంలో బాలయ్యకి స్పూఫ్‌గా నటించి మంచి బ్రేక్‌ని సంపాదించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పృధ్వీకి ఇప్పుడు సక్సెస్‌ తలుపు తట్టింది. ఇటీవలే బెంగాల్‌ టైగర్, సౌఖ్యం చిత్రాల్లో కామెడీని, ఓ రేంజ్లో పండించి తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు.

సాధరణంగా డైరెక్టర్లు తమ సినిమాల్లో కథానాయకులు చేసిన విన్యాసాల్ని తరువాత సినిమాల్లో వేరే డైరెక్టర్లు కమీడియన్లతో స్పూఫ్‌లు చేస్తే చిరాకు పడుతుంటారు కానీ 'సౌఖ్యం' లో పృధ్వీ చేసిన బాహుబలి స్పూఫ్‌ రాజమౌళికి నచ్చడంతో బాహుబలి-2 లో పృధ్వీకి కమీడియన్‌గా అవకాశం ఇచ్చాడు. అంతే కాదు బాహుబలి స్పూఫ్‌లో బాగా చేశారని పృధ్వీకి రాజమౌళి కితాబు కూడా ఇచ్చారట. అందరికీ తెలుసు బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎంత సూపర్‌ హిట్‌ అయిందో. అయితే బాహుబలిలో అసలు కామెడీ లేదని కొంత మంది విమర్శించారు కూడా. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని బాహుబలి -2 లో కొంచెం కామెడీని కూడా పండించాలని రాజమౌళి భావించారట. అందుకే పృధ్వీకి అవకాశమిచ్చారని తెలుస్తుంది.

English summary

Comedian 30 years Prudhvi get chance in Baahubali 2.