రవితేజ ఎందుకు వెనుకబడ్డాడు.. అసలేమైంది?

Why Raviteja not acting in movies

04:52 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Why Raviteja not acting in movies

ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసే రవితేజ ఎందుకు వెనుకబడ్డాడు? అసలు కారణం ఏమిటి? ఒకప్పుడు రవితేజ అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజ ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకునే వాడు. అయితే ఇప్పుడు ఆ వేగమే రవితేజని సరైన ఆలోచన లేకుండా ఏది పడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో రేసులో బాగా వెనకబడిపోయాడు మాస్ మహారాజా. మరీ డల్ అయిపోయిన టైంలో వచ్చిన బలుపు మంచి ఊపునిచ్చింది.

ఇక అప్పటినుంచీ దూకుడు కాస్త తగ్గించినా పెద్దగా మార్పు మాత్రం రాలేదు. కుర్ర హీరోలతో పోటీ పడాల్సిన టైంలో రవితేజకి సరైన అవకాశాలు రావటం లేదు. క్రిందటి ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగాల్ టైగర్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక అప్పటినుంచీ ఇప్పటిదాకా అతడి సినిమా ఏదీ మొదలవలేదు. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ పాటికి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ సినిమా పూర్తయ్యేదే... అయితే పారితోషికం తక్కువ ఇస్తున్నారంతూ ఆ సినిమా నుంచి బయటికొచ్చేశాడు రవితేజ. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో అనుకున్న సినిమాను త్వరగానే మొదలు పెడదామని చూశాడు కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పటిదాకా అది పట్టాలెక్కలేదు.

దీంతో రవితేజ కెరీర్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో విలువైన ఆర్నెల్లు వృథా అయిపోయాయి. మామూలుగా అయితే ఒక సినిమా పూర్తి చేయవచ్చు ఈ సమయంలో. ఇక ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకోక... అనుకున్న సినిమా మొదలు కాక వచ్చే రెమ్యునరెషన్ ని కూడా లాస్ అయ్యాడు రవితేజ... ఇప్పటికైనా మేలుకొని కొద్దిగా ఉత్సాహం చూపిస్తే తప్ప ఇప్పుడున్న పోటీలో నిలదొక్కుకోవటం కష్టమే. మరి ఈ సంగతి రవితేజ ఇప్పటికైనా గ్రహించాడో లేదో..

English summary

Why Raviteja not acting in movies