ఇంతకీ సమంతకు ఏమైంది? కొత్త చిత్రాలు ఎందుకు ఒప్పుకోవడంలేదు?

Why Samantha is not accepting new movies

03:26 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Why Samantha is not accepting new movies

ఎక్కువగా కష్టపడకుండానే జీవితంలో తనకు అన్నీ లభించాయని చెబుతున్న సమంత నటిగా తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తున్న ఈ చెన్నై చిన్నదాని ఇంటి పేరు త్వరలో మారబోతోంది. మన్మధుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మెంబర్ కానున్న విషయం కొంతకాలంగా సంచలన వార్తగా ప్రచారం అవుతోంది కూడా. యువ నటుడు నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో సమంత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటరర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది.

'జీవితంలో నాకు అన్నీ పెద్దగా కష్టపడకుండా సులభంగానే లభించాయి. చిన్న వయసులో ప్రతి దినం కొత్తగా ఉండాలని కోరుకునేదాన్ని. నటిని అయిన తరువాత అలాగే జరుగుతోంది. నిత్యం సరికొత్తగా జీవిస్తున్నా. నటిగా మొదట్లో సాధారణంగానే ఉన్నా ఆ తరువాత మారిపోయాను. నా పయనాన్ని ఇప్పుడు తిరిగి చూస్తే నా జీవితం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో మాయ జరిగిందని భావిస్తా. సినీరంగ ప్రవేశం చేసి ఆరేళ్లు అయ్యింది. కొంతకాలం ముందు వర్ధమాన నటిని. ఇప్పుడు సీనియర్ నటినయ్యా. దీంతో నాకు బాధ్యతలు అధికమయ్యాయి. ఇంతకు ముందు మాదిరి వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించలేను.

మంచి కథాంశం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయించుకున్నా' అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. అయితే పెళ్లి తరువాత నటిస్తుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ అమ్మడు స్పష్టం లేదు. అయితే ప్రస్తుతానికి ఈమె కొత్త చిత్రాలను అంగీకరించకపోవడాన్ని బట్టి ఎలా అర్ధం చేసుకోవాలో మరి.

English summary

Why Samantha is not accepting new movies