కేరళ లో 'సర్దార్' కి ఏం పని??

Why Sardar Team went to Kerala

01:28 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Why Sardar Team went to Kerala

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఘాటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఈ ఘాటింగ్‌ హైదరాబాద్‌ లో వేసిన ఒక స్పెషల్‌ సెట్‌లో కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌ నుంచి ఒక 5 రోజులు గ్యాప్‌ తీసుకుని సింగపూర్‌ వెళ్ళొచ్చాడు పవన్‌. ఈ షెడ్యూల్‌ అదే సెట్ లో ఈ నెలాఖరు వరకూ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తరువాత షెడ్యూల్‌ కోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేరళ వెళ్ళనున్నారు సర్దార్‌ సినిమా యూనిట్‌. కేరళలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 లేదా 6 వరకూ ఘాటింగ్‌ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ తర్వాత జరిగే ఘాటింగ్‌ హైదరాబాద్‌ లోనే జరగనుంది.

పవర్‌ సినిమా డైరెక్టర్‌ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన కాజల్‌ జతకట్టింది. రాయ్‌లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

English summary

Power Star Pawan Kalyan latest movie Sardar Gabbar Singh. It is sequeal for Gabbar Singh movie. For latest report after completion of hyderabad schedule Sardar team went to Kerala for another schedule.