షర్ట్స్ కి లెఫ్ట్ లోనే జేబులు ఎందుకుంటాయో తెలుసుకోండి

Why Shirt Pockets Always On The Left

12:58 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Why Shirt Pockets Always On The Left

కారణం లేకుండా ఏ పని చేయం... అలాగే కారణం లేకుండా ఏ వస్తువు అమరిక ఉండదు. ప్రతిదానికీ ఓ అర్ధం వుండే ఉంటుంది. పట్టించుకోకపోతే దాని విషయం తెలీదుకానీ , పర్టిక్యులర్ గా అడిగితే మాత్రం, అరె ఇది తెలీదా అనుకుంటాం. అలాంటిదే ఇది కూడానూ. ప్రపంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వస్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినవే. ఉదాహరణకు కంప్యూటర్ మౌస్నే తీసుకోండి. దాన్ని సాధారణంగా ఎవరైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆపరేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బటన్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహనాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మనకు అనేకం కనబడతాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా కూడా ఒకటి. అదేంటి, చొక్కాకు, చేతి వాటానికి సంబంధం ఏముంది? అనుకుంటే మాత్రం ఇది చదివి తీరాల్సిందే.

1/4 Pages

జేబులు లెఫ్ట్ సైడ్ ఉంటాయి ...

చొక్కాలను ఇప్పుడు ఆడ, మగ తేడా లేకుండా అందరూ ధరిస్తున్నారు. కానీ వాటికి ఉండే జేబుల్ని గమనిస్తే, కొన్ని రకాల టీషర్ట్స్కు అస్సలు జేబులే ఉండవు. అలాంటి విషయాన్ని పక్కనపెడితే కామన్ గా జేబులున్న చొక్కాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, చొక్కా జేబు ఎడమ వైపు ఉంటుంది. ఇంతకీ అలా అన్ని చొక్కాలకు ఎడమ వైపుకే జేబు ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.

English summary

Here Reason Behind Shirt Pockets Always On The Left side.