ఈ డాక్యుమెంటరీని భారత్ లో సన్నీ ఎందుకు వద్దంటోంది?

Why Sunny Leone rejecting her documentary in India

04:58 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Why Sunny Leone rejecting her documentary in India

బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు చెబితే మనకి ఠక్కున గుర్తొచ్చేది అడల్ట్ మూవీ స్పెషాలిటీ. ఇక ఈ భామ జీవిత కథతో మోస్ట్ లీ సన్నీ పేరుతో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కింది. కరేన్ జిత్ కౌర్ వోహ్రాగా ఓ సిక్కు కుటుంబంలో సన్నీ పుట్టినప్పటి నుంచి అడల్ట్ చిత్రాల స్టార్ గా ఎదిగిన క్రమం, ఆ తర్వాత బాలీవుడ్ లో తెచ్చుకున్న గుర్తింపు ఇలా అన్నీ ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయట. కానీ ఈ డాక్యుమెంటరీని మనదేశంలో విడుదల చేయడం సన్నీకి అస్సలు ఇష్టం లేదట. ఇందులో తన గురించి కంటే కల్పితమే ఎక్కువ ఉందని సన్నీ చెబుతోంది. ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో విడుదల కాకపోవచ్చు. ఎందుకంటే అది నా కథ కాదు. అది ఒకరి వూహాజనితంగా ఉంటుంది అని సన్నీ చెప్పింది.

ఈ డాక్యుమెంటరీ ఇటీవల టొరంటో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దీనికి సన్నీలియోన్ హాజరు కాలేదు. దీని గురించి ఆ డాక్యుమెంటరీ రూపకర్త దిలీప్ మెహతా మాట్లాడుతూ సన్నీ లియోన్ ఇందులో కొన్ని మార్పులు కోరుకున్నట్టు ఉన్నారు. అందుకే రాలేదేమో! అని చెప్పారు. దీనిపై సన్నీ స్పందిస్తూ మా కుటుంబంలో ఓ వేడుక ఉండటంతో నేను వెళ్లలేకపోయాను. ఏది ఏమైనా చివరకు అది జీవిత కథ అంటున్నారు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియాల్సిందే. నా జీవితంలో నాకు నచ్చని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంటరీలో చూపిస్తానంటే ఎలా కుదురుతుంది? నా మీద జాలిచూపించేలా ఉండే కథ అయితే అది నా కథే కాదు అని సన్నీ చెప్పింది.

ప్రజలు అసహ్యించుకునేలా ఉండే ఓ చిత్రాన్ని కోరుకోవడం లేదని సన్నీ చెబుతోంది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఈ చిత్రాన్ని కుటుంబం, స్నేహితులతో కలిసి చూడాలనుకుంటున్నా. ఇందులో చాలా భాగం అనవసరమైందే. దాన్నే ఈ డాక్యుమెంటరీలో చూపెడుతున్నారు అని చెప్పింది సన్నీ. డిసెంబరులో ఈ డాక్యుమెంటరీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అక్టోబరులో ముంబయిలో జరిగే మామి వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: బంపరాఫర్: ఆధార్ కార్డు ఉంటే రూ.1700కే 'ఐఫోన్ 7'!

ఇది కూడా చదవండి: బిర్యాని ఆకును కాల్చి గదిలో పెడితే ఒక అద్భుతాన్ని చూస్తారు!

ఇది కూడా చదవండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

English summary

Why Sunny Leone rejecting her documentary in India