కొత్త ప్లేసులో నిద్ర ఎందుకు పట్టదో తెలుసా?

Why we cannot sleep in new places

03:05 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Why we cannot sleep in new places

మనలో చాలామందికి కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ నిద్రపట్టదు. చాలా సేపు అటు తిరిగి, ఇటు తిరిగి ఎలాగో చివరకు పడుకుంటారు. అసలు ఎందుకు నిద్రపట్టదో కారణం ఏమిటో ఇటీవల అమెరికాకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకులు దీనికి ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారట. అంటే కొత్త ప్రదేశాల్లో తొలి రాత్రి అని అర్ధం.

ఇది కుడా చదవండి :పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

ఒక వ్యక్తి సాధారణంగా కొత్త ప్రదేశాలలో నిద్రపోతే మొదడు సగభాగం మోల్కొని ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రదేశం కాబట్టి ఏదైనా సమస్య వస్తుందేమో అని దానిని ఎదుర్కోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచుతుందట.

ఇది కుడా చదవండి :వంటింటి చిట్కాలు

అలాగే మొదడులోని ఎడమ హెమీస్పియర్ ఆ టైంలో చాలా హుషారుగా పనిచేస్తుందని పరిశోధకులు తెలియజేసారు. ఇలా కొత్త ప్రదేశాలలో నిద్రపట్టకపోవడం అనేది మనుషుల్లోనే కాదు డాల్ఫిన్స్, వేల్స్ వంటి వాటిలో కూడా సంభవిస్తుంది. కొత్త ప్రదేశాలలో నిద్రఎందుకు పట్టదో తెలిసిపోయింది కదా

ఇది కుడా చదవండి :జుట్టు పెరుగుదల ఆగిపోవటానికి కారణాలు

English summary

Do you struggle to fall asleep in new places? Don't blame your pillows or the bed sheets. Instead, blame your own hyper-vigilant brain.