నిద్రలో ఉన్నప్పడు పడిపోతున్నామనే భావన ఎందుకు కలుగుతుంది?

Why we feel that falling down when we are sleeping

04:22 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Why we feel that falling down when we are sleeping

ఈ ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో అనుభూతి ఉంటుంది. కొందరికి కొన్నికొన్ని లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు బాగా నిద్రపోతూ ఉంటారు. మధ్య రాత్రి అనుకోకుండా.. అసలు మెలకువ రాకుండానే.. సడన్ గా కిందపడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. హఠాత్తుగా ఆకాశం నుంచి పడిపోతున్నామా అన్న భయంతో ఉలిక్కి పడిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ బలంగా కలిగి.. చివరికి బెడ్ పై నుంచి కిందకు పడిపోతుంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి, మేల్కొల్పుతారు.

మీరు ఎందుకు ఇలా సడన్ గా పడిపోతున్న వాళ్ళు తమని తాము ఎన్నిసార్లు ప్రశ్నించుకుని వున్నా, దీనికి సమాధానం దొరికి ఉండదు కదూ. చాలా సందర్భాల్లో ఇలా ప్రశ్నించుకుని ఉంటారు. కానీ.. దీనికి కావాల్సిన ఎక్సప్లనేషన్ దొరికి ఉండదు. ఆవిధంగా ఇది చాలా క్లిష్టతరమైన పని అని చెప్పక తప్పదు.

1/3 Pages

1. రోజూ రాత్రి నిద్రలో ఒకే సమయానికి మెలకువ వస్తే దేనికి సంకేతం?


అయితే నిద్రపోయేటప్పుడు ఆత్మ మన శరీరాన్ని వదిలి వెళ్లిపోయి తిరుగుతూ ఉంటుందని, అది మళ్లీ తిరిగి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. ఇలాంటప్పుడు శరీరంలో కుదుపు వచ్చిన ఫీలింగ్ కలిగి, హార్ట్ బీట్ కూడా పెరుగుతుందట. అప్పుడే, కిందపడిపోయిన ఫీలింగ్ కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇలాంటి ఫీలింగ్ ని హైప్నిక్ జెర్క్ అని మెడికల్ టర్మ్స్ లో పిలుస్తారని చెబుతారు.

ఉన్నట్టుండి కండరాల్లో వచ్చే కదలికల కారణంగా లేదా ఏకాగ్రత కోల్పోయినప్పుడు ఇలా నిద్రలో కింద పడిపోవడం, పడిపోతున్న ఫీలింగ్ కలగడం జరుగుతుందట. అప్పుడప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురైతే, పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, రెగ్యులర్ గా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తే, అది నరాలకు సంబంధించిన వ్యాధికి సంకేతంగా భావించాలట.

English summary

Why we feel that falling down when we are sleeping