గడియారం ముళ్లు ఎడమ నుంచి కుడి వైపుకే ఎందుకు తిరగాలి?

Why will clock thorns turns left to right

11:36 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Why will clock thorns turns left to right

చిన్న చిన్న విషయాలు మనకు తెలిసినట్ట అనిపిస్తాయి కానీ తెలీవు. ఒక వేళ దాని గురించి విడమరచి ఎవరైనా చెబితే, ఓహో అదా అనుకోవడం కూడా చాలా మందిలో చూస్తుంటాం. అంతేకాదు, ప్రస్తుతం మనం నిత్యం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించి ఎంతో కొంత చరిత్ర ఉంటుంది. అదెలా వచ్చిందీ, దాన్ని ఎవరు కనుక్కుందీ, ఎప్పటి నుంచి దాన్ని ప్రజలు వాడడం మొదలు పెట్టారు.. ఇలా దాదాపుగా ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించిన ఆవిర్భావం, దాని కథా కమామీషు ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు గడియారంలో ముళ్ళు తీసుకుంటే, అవి తిరిగే పద్ధతికి కూడా ఓ చరిత్ర ఉంటుంది.

అవి ఎడమ వైపు నుంచి కుడికి తిరుగుతుంటాయి కదా, అసలు అవి అలాగే ఎందుకు తిరగాలి, కుడి నుంచి ఎడమకు ఎందుకు తిరగవు? అని ఆలోచించినా, ఎవరైనా అడిగినా వెంటనే సమాధానం దొరకదు. మనకు తెలిసినట్టు అనిపించినా కూడా చెప్పలేని స్థితి వస్తుంది. అయితే గడియారం ముళ్ళు గురించి పరిశీలిస్తే, భూమి ఉత్తరార్థ గోళంలో కుడి నుంచి ఎడమకు తిరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుడు ఇందుకు పూర్తిగా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాడు. అంటే ఎడమ నుంచి కుడికి అన్నమాట. ఈ క్రమంలోనే గడియారాలు అందుబాటులో లేని కాలంలో ఒకప్పుడు సన్ డయల్స్ వంటి వాటి ద్వారా సమయాన్ని కనుక్కునే వారు.

అన్నవరం కొండ మీద ఓ సిద్ధాంతి రూపొందించిన సన్ డయల్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అసలు సూర్యుడు గమనాన్ని, దిశ(ఎడమ నుంచి కుడికి)ను బట్టి ఆనాటి కాలంలో సమయాన్ని లెక్కించే వారు. ఈ క్రమంలో అనంతరం వచ్చిన గడియారాలు కూడా అదే దిశను అనుసరించి తయారు చేయబడ్డాయి. అందుకే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు గడియారాల్లోని ముల్లులు సూర్యుని దిశలాగే ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నాయి. అంతే తప్ప, ఇందులో వేరే ఏ ఇతర కారణమూ లేదు. ఒక వేళ భూమి దక్షిణార్థ గోళంలో తిరుగుతూ ఉన్నప్పుడు కనుక చూసి ఉంటే పైన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేక దిశలో అంతా జరిగేది.

అప్పుడు సూర్యుని దిశ మారుతుంది కాబట్టి గడియారాలను కూడా అదే విధంగా తయారు చేసి ఉండే వారు. అంటే కుడి నుంచి ఎడమ వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేవి. ఈ క్రమంలో గడియారం ముళ్లు తిరిగే దిశకు క్లాక్ వైజ్ డైరెక్షన్ అనే పేరు కూడా వచ్చింది. దీనికి వ్యతిరేక దిశను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటారు. కుడి నుంచి ఎడమ వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేలా పాలో ఉసెలో అనే వ్యక్తి ఓ గోడ గడియారాన్ని ఒకప్పుడు తయారు చేశాడట. ఆ దిశలో తిరిగే గడియారం ఇదొక్కటేనట. అందులో అతని చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ గడియారం ఇప్పటికీ భద్రంగా ఉందట. అదండీ సంగతి.

English summary

Why will clock thorns turns left to right