బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) ఎందుకు తినాలి ?

Why you should not skip breakfast

12:57 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Why you should not skip breakfast

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో మొదటిగా తీసుకొనే ఆహారం. ఇది మన శరీరానికి నీరు వలే చాలా ముఖ్యమైనది. అంతేకాక బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా గ్యాప్ తర్వాత తీసుకొనే ఆహారం. మనం ఉదయం నిద్ర లేచిన రెండు గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ మానకుండా ఉండటానికి 5 ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

1/6 Pages

1. కేలరీలను తగ్గిస్తుంది

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో తీసుకొనే మొదటి ఆహారం. బ్రేక్ ఫాస్ట్ కేలరీలను కరిగించటానికి సహాయపడుతుంది. అది ఎలా అంటే రాత్రి నిద్ర తర్వాత ఉదయం మేల్కొనటానికి మధ్య చాలా సమయం ఉండుట వలన ఉదయం లేవగానే మన శరీరం కొంత శక్తిని డిమాండ్ చేస్తుంది. ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ ద్వారా వచ్చిన కేలరీలు శరీరంలో నిల్వ ఉండి రోజంతా ఉపయోగపడతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే, కావలసిన శక్తి
కోసం మధ్యాహ్న భోజనం ఎక్కువగా తినే అవకాశాలు ఉన్నాయి. దాంతో మన శరీరం ఎక్కువగా కొవ్వును గ్రహించి బరువు పెరగటానికి కారణం అవుతుంది.

English summary