అన్నాచెల్లెలుగా మారిన భార్యాభర్తలు.. ఆ తరువాత ఘోరాలు!

Wife and husband cheated girls as a brother and sister

03:21 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Wife and husband cheated girls as a brother and sister

భార్యాభర్తలే అన్నాచెల్లెలుగా మారిపోయారు.. ఆ తరువాత చెయ్యకూడని ఘోరాలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాల్లో దంపతులు ఫేస్ బుక్ ద్వారా తమ మోసాలకు తెర తీశారు. తిరుచ్చి తిరువేంబుయూర్ కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని కోసం పలు చోట్ల గాలించారు. అయితే, గత రెండు రోజుల క్రితం ఆ విద్యార్థి నావలంపట్టు పోలీసు స్టేషన్ లో హాజరై ఓ యువకుడు తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ధరించిన 8 సవర్ల నగలు కూడా అపహరించి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ యువకుడికి అతడి సోదరి కూడా సహకరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో చెప్పింది. తిరువేంబుయూర్ డీఎస్పీ కలైసెల్వన్, ఇనస్పెక్టర్ సురేష్ కుమార్ నేతృత్వంలోని పోలీసులు బలగాలు ఫోటో ఆధారంగా వారి కోసం తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుచ్చి బస్టాండ్ లో అన్న, చెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన గురు దీన దయాళన్ అనే పట్టభద్రుడైన ఆ యువకుడు నిరుద్యోగి. ఫేస్ బుక్ లో యువతులతో పరిచయం పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు తెలిసింది.

కాగా, 2013వ సంవత్సరం ప్రియదర్శిని అనే యువతిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడని, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్ధేశంతో దంపతులు మోసానికి తెర తీసినట్లు పోలీసులుకు తెలిసి షాకయ్యారు. గురు దీనదయాళన్ ఫేస్ బుక్ ద్వారా మహిళలను తన వలలో పడేసి పారిపోయి వివాహం చేసుకోవడానికి నగలతో రావాలని నమ్మించి రప్పించుకునేవాడు. అతడి మాటలు నమ్మిన యువతులు అలాగే వచ్చి మోసపోయేవారని, వచ్చిన యువతులకు గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు అన్న, చెల్లిగా పరిచయం చేసుకునేవారని తెలిసింది. ఇప్పటివరకు నిందితుడు 20 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

English summary

Wife and husband cheated girls as a brother and sister