రెండో పెళ్లి చేసుకున్న భర్తను.. ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే భయపడతారు!

Wife attacks with acid for husband gets second marriage

03:13 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Wife attacks with acid for husband gets second marriage

ఇప్పటి వరకు భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్తలు ఏం చేశారో చూశాం. కానీ ఇప్పుడు భర్త రెండో పెళ్లి చేసుకున్నందుకు భార్య ఏం చేసిందో చూడబోతున్నాం.. ఈ సంఘటన జమ్మూలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. రెండో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ భర్తపై ఆగ్రహంతో మొదటి భార్య యాసిడ్ తో దాడి చేసిన ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగింది. కథువా జిల్లా బనీ పట్టణానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ అయిన ముహమ్మద్ దిన్ షమీమా అఖ్తర్ ను పెళ్లాడాడు. ఆయనకు పదేళ్ల వయసు గల కూతురు ఉంది. తానుండగానే భర్త ముహమ్మద్ రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పదేళ్ల కూతురు, మరో ఇద్దరు వ్యక్తుల సహకారంతో భర్తపై యాసిడ్ తో దాడి చేసింది.

అంతే... యాసిడ్ దాడిలో భర్త ముహమ్మద్ తో పాటు భార్య షమీమా కూడా గాయాల పాలయ్యారు. గాయపడిన భార్యభర్తలిద్దరినీ కథువా పట్టణంలోని సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భర్త ముహమ్మద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

English summary

Wife attacks with acid for husband gets second marriage