ప్రముఖుల సమక్షంలో భర్తకు బడితె పూజ చేసిన భార్య(వీడియో)

Wife beats husband in front of guests

12:28 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Wife beats husband in front of guests

కోపాన్ని, ఆవేశాన్ని ఎవరూ అణచుకోలేకపోతున్నారు. పర్యవసానంగా ప్రముఖుల సమక్షంలో చోటుచేసుకున్న ఈ పరిణామం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'పూజకు వేళాయేరా', 'మనసు పడిన కథలు' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వివాహేతర సంబంధాలు బయటపడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు. రచయిత్రి రాజేశ్వరి చంద్రజతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త వెంకటస్వామిని భార్య సూర్యప్రభ చితకబాదారు.

'పూజకు వేళాయెరా' అనే పుస్తకం గురించి మాట్లాడుతున్న సమయంలో వేదికపై ఒక్కసారి గందరగోళ వాతావరణం ఏర్పడి సభ కాస్త.. 'బడితె పూజకు వేళయెరా' లాగా మారింది. అప్పటి వరకు సాహితీవేత్తల ప్రసంగాలతో ఆహ్లాదంగా ఉన్న సభికులు ఒక్కసారిగా తిట్లు, శాపనార్థాలు, అరుపులు, కేకలు వినపడటంతో హడలిపోయారు. అప్పటి వరకు పక్కనే నిలబడి ఉన్న మహిళ సూర్యప్రభ అప్పుడే వేళయినట్లు వేదికపైకి దూసుకొచ్చి భర్తకు బడితె పూజ చేసింది. ఇందులో ఆమెతో పాటు బంధువులు కూడా ఓ చేయి వేశారు. స్టేజ్ పై వెంకటస్వామి ఒక్కసారిగా కిందపడిపోయాడు.. పక్కనే ఉన్న చంద్రజ వారితో వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఈ హఠాత్ పరిణామానికి అందరూ అవాక్కయ్యారు.

English summary

Wife beats husband in front of guests