పెళ్ళైన పది రోజులకే భార్య అసలు కధ బయటపడింది!

Wife cheated husband after 10 days of marriage

03:22 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Wife cheated husband after 10 days of marriage

ఆ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఆనందంగా బ్రతకాలనుకున్నాడు.. పెళ్ళై సరిగ్గా పదిరోజులు కూడా గడవలేదు. ఇంటికి వేసిన రంగులు ఇంకా వెలిసిపోనే లేదు. తనతో పాటు ఏడడుగులు నడిచిన భార్య గురించి తెలిసి ఖంగు తిన్నాడు. ఈ సంఘటన గుజరాత్ లోని అమరైవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే, గుజరాత్ లో యోగిత అనే యువతి, ఆమె అన్నయ్య సుధాకర్ బతకడానికి దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు. మొదట్లో చిన్నాచితకా దొంగతనాలు చేసిన వీరిద్దరూ రూట్ మార్చారు. త్వరగా జీవితంలో స్థిరపడొచ్చనే దుర్భుద్దితో ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించి తన చెల్లికి మంచి పెళ్లి కొడుకును చూడాలని సుధాకర్ ఫోటోలిచ్చాడు.

ఇదే సమయంలో అమర్ వాడీలోని ఆదర్శ్ అపార్ట్మెంట్స్ కు చెందిన రాజ్ పుత్ కు పెళ్లి సంబంధాలు చూసే పనిలో అతని అంకుల్ డాక్టర్. రమేష్ రాజ్ పుత్ నిమగ్నమయ్యారు. యోగిత ఫోటోను రమేష్ చూశాడు. అమ్మాయి లక్షణంగా ఉందని కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలని మ్యారేజ్ బ్యూరోను అడిగాడు. రాజ్ పుత్ ను వెంటపెట్టుకుని రమేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యుల వివరాలు చెప్పాలని పెళ్లికి ముహుర్తం పెట్టుకుందామని రమేష్ కోరాడు. తనకు అన్నయ్య మాత్రమే ఉన్నాడని... అనాథలమని యోగిత చెప్పింది. అమ్మాయి నచ్చడంతో కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ 7న పెళ్లి నిశ్చయించుకున్నారు.

ఎట్టకేలకు అంగరంగ వైభవంగా రాజ్ పుత్ కు, యోగితకు పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన 10రోజులకు యోగిత అసలు రంగు బయటపడింది. ఇంట్లో నగలు, లక్ష రూపాయల డబ్బుతో యోగిత ఉడాయించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. యోగిత, తన అన్నయ్య కలిసి 18 నెలల్లో ముగ్గురు యువకులను మోసం చేసినట్టు తేలింది.

English summary

Wife cheated husband after 10 days of marriage