భార్య అక్రమ సంబంధాన్ని వీడియో తీసిన భర్త

Wife cheats husband

09:59 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Wife cheats husband

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. సహజీవనం మాటున దారుణాలు జరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమంటే, తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని, బందువులు, స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఓ భర్త.. ఆమె పై నిఘా పెట్టి ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను చిత్రీకరించి పోలీసులకు ఇచ్చాడు. హైదరాబాద్ కి చెందిన ఓ యువతతో.. సికింద్రాబాద్‌ చెందిన ఓ వ్యక్తితో 2009లో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు ఎంబీఏ చదువుతున్న సమయంలో ఆ యువతి తన కాలేజీ స్నేహితుడు అయిన విజయ శేఖర్‌ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది.

అయితే ఆ యువతి తనకు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసారని పేర్కొంటూ కాపురానికి కుడా వెళ్ళలేదు. కాపురానికి రావాలని భర్త కోరినా, ఆమె రాలేదు. అంతే కాక భర్త, అత్తమామల పై 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో భర్తకి ఆగ్రహం కలిగింది. ఇంతలో భార్యకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బంధువులు, స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ఆమెని ఎలాగైనా పట్టించాలని భావించాడు. దీనితో భార్యపై నిఘా పెట్టాలని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. ప్రియుడి ఇంట్లో ఉందని భావించి అక్కడికి వెళ్ళాడు. అతని అనుమానం నిజం అయింది. ప్రియుడి ఇంట్లో తన భార్య ఉన్న సమయలో వీడియో తీసాడు.

ఆ వీడియో ని నారాయణగూడ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు దీని పై దర్యాప్తు చేస్తున్నారు. అదండీ బాగోతం చూసారుగా ఎలాంటి దారుణమో.

English summary

Wife cheats husband. Husband takes video while his wife romancing with her boy friend.