తల్లితో అక్రమ సంబంధం... భార్యను వ్యభిచారం చేయమని ఒత్తిడి

Wife committed suicide to avoid husband harassment

10:50 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Wife committed suicide to avoid husband harassment

ఇదో ఘోరం... కన్నతల్లి హేండ్ కూడా ఇందులో వుంది. ఎన్ని చట్టాలున్నా మహిళలకు అక్కరకు రాని విధంగా వున్నాయి. మనుషుల్లో మార్పు లేదు. అందుకే అబలలు బలైపోతున్నారు. తాజాగా పెళ్లై అత్తారింటికి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ ఆడబిడ్డకు దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి. మెట్టినింట అడుగుపెట్టిందో లేదో సాక్షాత్తూ భర్తే వ్యభిచారం చేయమని వేధిస్తుండటంతో ఆమెకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఈ క్రమంలో తన భర్తకు తన తల్లితో అక్రమసంబంధం ఉందన్న భయంకరమైన నిజం తెలియడంతో భర్త, తల్లిని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు లెటర్ రాసి, అదేరోజు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలొదిలింది.

హైదరాబాద్ శివారు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఝాన్సీ. ఆమె ఫ్యామిలీ నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ తల్లి హైదరాబాద్కు చెందిన విజయేందర్రెడ్డి వద్ద రూ. 4 లక్షలు అప్పు తీసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్పు తీర్చలేక తన కుమార్తె ఝాన్సీని వియజేందర్రెడ్డికి ఇచ్చి వివాహం చేసింది. అయితే, పెళ్లి సందర్భంగా ఝాన్సీ తల్లి వియజేందర్ వద్ద నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఝాన్సీ అత్తగారింటికి వెళ్లిన తర్వాత వ్యభిచారం చేయాలని భర్త వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో తల్లి-భర్తల వ్యవహారం కూడా ఝాన్సీకి తెలియడంతో విస్తుపోయిన ఝాన్సీ తనకు రక్షణ కల్పించాలంటూ ఈనెల 24న ముఖ్యమంత్రి కెసిఆర్, పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక నకిరేకల్ సీఐకు తన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసి, అదేరోజు తన తమ్ముడి రూం దగ్గర ఆత్మహత్యకు పాల్పడింది. విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు పూర్తి చేశారు. అయితే ఝాన్సీ రాసిన లేఖ అందుకున్న సిఐ విచారణకు వచ్చి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఝాన్సీ సోదరుడు, తల్లి, భర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుగుతోంది.

English summary

Wife committed suicide to avoid husband harassment