భార్య ఉపవాసం చేసింది... చనిపోయిన భర్త తిరిగొచ్చాడు!

Wife did fasting and husband came back as alive

10:42 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Wife did fasting and husband came back as alive

అవునా, అంటే అవుననేలా ఉంది ఈ వ్యవహారం. సతీ అనసూయ తన భర్త ప్రాణాలను యమధర్మరాజు వెంట పడి కాపాడుకున్న పురాణ కధ మనకు తెల్సిందే. కానీ ఈ ఆధునిక అనసూయ ఉపవాసంతో భర్తకు తిరిగి ప్రాణం పోసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రమాదంలో మరణించినట్లు సైన్యం ప్రకటించిన వ్యక్తి భార్య నమ్మకంతో ఉపవాసం చేస్తే ఆయన నిజంగానే ప్రాణాలతో ఇంటికి తిరిగొచ్చి తలుపు కొట్టాడు. పదవీ విరమణ చేసిన సుబేదార్ కైలాశ్ యాదవ్ ఇంటి తలుపును అర్ధరాత్రి సమయంలో ఎవరో కొట్టారు. తాగుబోతు అల్లరి చేస్తున్నాడనుకొని అతన్ని బెధిరించి పంపించేందుకు సరంజామా అంతా సిద్ధం చేసుకుని తలుపు తీశాడు.

తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి కైలాశ్ నిర్ఘాంతపోయాడు. చనిపోయాడని సైన్యం ధ్రువీకరించిన తన కొడుకు ధర్మవీర్ ను చూసి ఆనందంతో పెదవులు కదులుతున్నా మాటలు రావడం లేదు. ఇంతలో అతని భార్య, కోడలు, పిల్లలు, మరో కొడుకు వచ్చి చూశారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ధర్మవీర్ సింగ్ సావధానంగా కూర్చుని అన్ని విషయాలూ చెప్పాడు. 2009లో డివైడర్ ను ఢీకొని తమ వాహనం బోల్తా పడిందని, అందులో తనతోపాటు మరో ఇద్దరు ఉన్నారని చెప్పాడు. ఆ ప్రమాదం తర్వాత తనకు ఏమీ గుర్తు లేదన్నాడు. హరిద్వార్ లో తిరుగుతూ గడిపినట్లు తెలిపాడు.

గత వారం తాను బిచ్చమెత్తుకుంటున్నపుడు ఓ బైక్ వచ్చి తనను ఢీకొన్నట్లు మాత్రమే తనకు గుర్తుందన్నాడు. ఆ బైకర్ వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్ళాడని, అనంతరం తనకు స్పృహ వచ్చిందని చెప్పాడు. పాత జ్ఞాపకాలన్నీ రావడంతో మళ్ళీ ఇంటికొచ్చానని వివరించాడు. తనను ఢీకొట్టి, ఆసుపత్రిలో చేర్పించిన బైకర్ తనకు రూ. 500 ఇచ్చాడని చెప్తూ ఆ బైకర్ కు ధర్మవీర్ సింగ్ పదే పదే ధన్యవాదాలు చెప్పాడు. ఆ డబ్బు తీసుకొని ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి ఆల్వార్ సమీపంలోని తన గ్రామం భిటేడా వచ్చినట్లు తెలిపాడు. ఈ విధంగా తిరిగొచ్చి, కుటుంబ సభ్యులందర్నీ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.

ధర్మవీర్ సోదరుడు రామ్ నివాస్ మాట్లాడుతూ తన సోదరుడు సైనిక వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురైనపుడు ఆ వాహనంలోని ముగ్గురూ మరణించినట్లు మొదట్లో భావించినా, ఇద్దరు తిరిగి తమ యూనిట్లకు వెళ్ళిపోయారని తెలిపాడు. ధర్మవీర్ డెహ్రాడూన్ లోని 66 ఆర్మర్డ్ రెజిమెంట్ లో జవాన్ అని తెలిపాడు. 2009లో ధర్మవీర్ మరణించినట్లు భావించిన సైన్యం, మూడేళ్ళ తర్వాత ధ్రువపత్రాన్ని, కుటుంబానికి పింఛనును మంజూరు చేసిందన్నాడు. కానీ ధర్మవీర్ భార్య మనోజ్ దేవి తన భర్త కోసం ఎంతో తపించేదని తెలిపాడు. భర్త క్షేమంగా ఉండాలని ఉపవాసం చేస్తూ ఉండేదని పేర్కొన్నాడు.

ఆమె మాట్లాడుతూ తన మనసులో తన భర్త బ్రతికే ఉన్నట్లు గట్టిగా నమ్ముకున్నట్లు తెలిపారు. ఆయనను మళ్ళీ చూస్తానన్న నమ్మకం తనకు ఉందని, తన పూజలు, ఉపవాసం ఫలించాయని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. అదండీ కధ.

English summary

Wife did fasting and husband came back as alive