భర్త ఇంటిముందు భార్య ఆందోళన

Wife Fight Against Husband illegal Affair in Begumpet

11:57 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Wife Fight Against Husband illegal Affair in Begumpet

హైదరాబాద్ నగరంలోని బేగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి చంద్రబాబునగర్‌లో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త యాదగిరి ఇంటి ఎదుట మొదటి భార్య ఆందోళనకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా యాదగిరి భార్యలు ఘర్షణ పడ్డారు. ఫలితంగా అక్కడ ఉధృక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదగిరి, కట్టుకున్న భార్య కు దూరంగా ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య, ఆమె పిల్లలు మంగళవారం చంద్రబాబు నగర్‌కు వచ్చి రెండో భార్య ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గల మధ్య గొడవ చెలరేగి, పరస్పరం కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గొడవ పడుతున్న మహిళలను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

ఇవి లేకుండా మన డైరెక్టర్లు సినిమా తీయలేరు

రమ్యకృష్ణతో గొడవ పెట్టుకున్న నారా రోహిత్!

English summary

A Man In Hyderabad has an illegal affair with another woman and first wife came to second wife along with some of the Woman Leaders in Begumpet. The two wives were fight each ohter. This was occurred in Hyderabad.