ప్రియుడు కోసం కూతురు, అత్తను చంపేసింది

Wife killed daughter and mother in law

04:44 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Wife killed daughter and mother in law

హత్యలు దోపిడీలు, దారుణాలు సర్వ సాధారనమయ్యాయి. ఈ విషయంలో వారూ వీరు అనే తేడాలేదు. తాజాగా కోర్టు తీర్పు చూస్తే, ఐటి జంట హంతకులని తేలింది. వివరాల్లోకి వెళ్తే, ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నకూతురు, అత్తను కడతేర్చిన కసాయి అను శాంతి, నినో మ్యాథ్యూలను తిరువనంతపురం కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇక్కడి టెక్నోపార్క్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేసే నినో మ్యాథ్యూ, అను శాంతి సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న అను శాంతి మూడేండ్ల కుమార్తె స్వస్థిక, అత్త ఒమానా, ఆమె భర్త లిజేష్‌ను హతమార్చేందుకు ప్లాన్‌ వేసుకున్నారు.

2014, ఏప్రిల్‌ 16న తమ ప్రణాళికను అమలు చేస్తూ.. అను శాంతి మూడేండ్ల కుమార్తెను, అత్తను దారుణంగా హతమార్చారు. భర్త లిజేష్‌ కోసం అరగంట పాటు వేచిచూసి రాగానే దాడికి తెగబడ్డారు. లిజేష్‌ ప్రాణాపాయం నుంచి తృతిలో తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో మ్యాథ్యూను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రథమ నిందితుడు నినో మ్యాథ్యూను కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. ఈ కేసులో 49 మంది సాక్షులను విచారించారు. 85 పత్రాలను సాక్ష్యాల కింద పరిగణించారు. నిందితుడి లాప్‌టాప్‌లో వెల్లడైన అంశాలను సాక్ష్యాలుగా ఆమోదించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందుతుల పై ఎలాంటి కనికరం చూపరాదని ప్రాసిక్యూషన్‌ వాదించింది. మొత్తానికి శిక్ష పడింది.

English summary

Wife killed daughter and mother in law. A software engineer wife killed her daughter and mother in law for her boyfriend.