అందుకు ఒప్పుకోలేదని భర్తను లేపేసింది!

Wife killed her husband for not accepting romance in Gujarat

11:40 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Wife killed her husband for not accepting romance in Gujarat

పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కానీ ఆమెకు అలా కనిపించలేదు సరికదా అడ్డు అనుకుంది. ఓ భార్య చేసిన పని ప్రస్తుతం ఆమెకు గుణపాఠంగా మారింది. తన భర్తను చిన్నచూపు చూడటమే కాకుండా.. తనతో సరిగా ఉండేవాడు కాదనుకున్న ఆ భార్య తన భర్తను అనుమానంతో వేధించేది. ఒకరోజు ఆమె అడిగినదానికి ఒప్పకోలేదని.. తన భర్తను కడతేర్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన విమ్లా వాఘేలా(54) తన భర్త నరసిన్హ్ తో కలిసి నోబెల్ నగర్ లో జీవనం కొనసాగించేది. భర్తకు అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానం ఆమెలో రేకెత్తడంతో తరుచూ ఇద్దరి మధ్యా గొడవ రేగేది.

ఒకరోజు తనతో శృంగారం చేయమని భార్య కోరగా అందుకు భర్త నిరాకరించాడు. అంతే.. ఆమె కోపంతో ఊగిపోయింది. పక్కనే ఉన్న కర్రను తీసుకుని భర్త తల పై గట్టిగా బాదేసింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. తన భర్త హత్యకు గురయ్యాడంటూ ఏమీ తెలియనట్లు ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు అనుమానం రావడంతో తమ స్టైయిల్లో విచారణ జరిపారు. చివరకు తన భర్తను తానే హత్య చేశానని ఒప్పుకుంది. ఇక తాజాగా అహ్మదాబాద్ సిటీ కోర్టు ఆమెకు జీవిత ఖైదు శిక్షను విధించింది.

English summary

Wife killed her husband for not accepting romance in Gujarat