తాగిన మత్తులో...భర్తను చంపేసిన భార్య

Wife Killed Her Husband In Nalgonda District

03:24 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Wife Killed Her Husband In Nalgonda District

రోజు రోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్య చేయడం చాలా ఈజీ అయిపొయింది. పెద్దగా కారణం కూడా దీనికి ఉండడం లేదు. తాజాగా తాగిన మత్తులో భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే, నల్లగొండ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన గండికోట సుగుణమ్మ, వెంకటేష్‌(50) భార్యాభర్తలు. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి సైదాబాద్‌ చింతల్‌బస్తీ(నీలం రాజశేఖర్‌ రెడ్డినగర్‌)లో నివసిస్తున్నారు. వెంకటేష్‌ స్టోన్‌ కట్టర్‌గా, సుగుణ కూలీ పనులు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తె లకు వివాహం అయింది. కుమారుడు వేసవి సెలవులకు గౌరారం వెళ్లాడు. వెంకటేష్‌కు ఆరు నెలల క్రితం ప్రమాదంలో కాలు విరిగింది. నడవలేకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. సుగుణ ఆదివారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తూ కాంపౌండ్‌ నుంచి కల్లు తెచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రాత్రికి కల్లు తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

ఇవి కూడా చదవండి:పబ్లిసిటీ కోసం అందరి ముందు ట్రైన్లో బట్టలిప్పేసింది(వీడియో)

తాగిన మత్తులో ఉన్న సుగుణ ఇనుపరాడ్‌తో భర్త తల పై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సుగుణ మత్తులో గమనించకుండా నిద్రపోయింది. ఉదయం లేచి చూడగా భర్త మృతి చెంది ఉన్నాడు. అయితే విషయాన్ని దాచేందుకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి సైదాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని మలక్‌పేట ఏసీపీ సుధాకర్‌, ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య, క్లూస్‌ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:సన్నీతో ఒక రాత్రి పడుకునే ఛాన్స్ వస్తే.. అనే ప్రశ్నకు వర్మ దిమ్మతిరిగే ఆన్సర్

ఇవి కూడా చదవండి:40 సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తిని చూశారా?

English summary

A Wife named Sugunamma and her husband Venkatesh were working as daily labourers in Nalgonda District and they two drunk Alcohol and killed her husband and she slept . She realised that she killed her husband in the next day morning.