పోర్న్ చూస్తున్నాడని తాతని చంపేసిన బామ్మ

Wife killed husband for he is watching blue films

09:49 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Wife killed husband for he is watching blue films

ఈ కలికాలంలో ఎన్నో దారుణాలు, మరెన్నో ఘోరాలు... సహనం లేదు.. విచక్షణ లేదు... అందుకే కట్టుకున్న భర్త తనతో కాపురం చేయకుండా... బ్లూ ఫిలింలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడని... భర్తను చంపేసింది ఓ భార్య... 15 ఏళ్ల వయసులోనే ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకి వివాహం అయ్యి దాదాపు 50 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు ఇద్ద‌రూ ఏడు ప‌దుల వ‌య‌స్సుకు దగ్గరయ్యారు. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఏంటంటే... ప‌దేళ్ల కాలంలో అత‌డు త‌న భార్య‌తో శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డంతో పాటు ప‌దే ప‌దే పోర్న్ వీడియోలు చూస్తుండ‌టంతో ఆగ్రహించిన ఆ సతీమణి త‌న భ‌ర్త‌ను కిరాతకంగా చంపేసింది.

ప్రేమతో మొదలైన వీరి జీవితం చివరిదశలో మాత్రం విషాదంగా మిగిలింది. వివరాల్లోకి వెళ్తే... లాంక్ షైర్‌లోని ఓస్వాల్డ్ విజిల్‌లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు ఆమె బయటకు వెళ్లి తిరిగి వచ్చిచూస్తే భర్త ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని మాట దాటేశాడు. భ‌ర్త త‌న‌ను ట‌చ్ చేయ‌క‌ుండా, అశ్లీల చిత్రాలు చూడడంతో కోపానికి గురైన లిండా ఓ రోజు ఆవేశంలో చిన్న సుత్తితో పదేపదే అతడి తలపై కొట్టడంతో చనిపోయాడు. 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను.

కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నా, తీవ్రంగా కొట్టా. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం తెగ చూస్తున్నాడు, అతడికి ఎంత ధైర్యం. నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె వివరణ ఇస్తోంది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేసినట్లు చెప్పింది.

English summary

Wife killed husband for he is watching blue films. In Lancashire a 70 years old lady killed her 78 years husband for watching porn movies.