గొంతు నులిమి భర్తను చంపేసింది.. ఆ పై నగదుతో పరార్

Wife killed husband in Uttar Pradesh

03:58 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Wife killed husband in Uttar Pradesh

దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. కట్టుకున్న భార్యను కడతేర్చేది ఒకడైతే, కన్నతల్లిని హతమార్చే ప్రబుద్ధుడు ఒకడు, ఇక భర్తను చంపేది మరొకరు... ఇదీ వరస... ఇదే కోవలో బరితెగించిన ఓ భార్య నిర్వాకం ఇది. తన భర్త.. కుమారుడికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చింది. భర్త నిద్రమత్తులో ఉండగా గొంతునులిమి ప్రాణాలు తీసింది. అనంతరం ఇంట్లోని భారీ నగలు, నగదుతో ఉడాయించింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది. 45 ఏళ్ల నిర్మల్ సింగ్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కొడుకు భరత్ వికలాంగుడని తెలుస్తోంది. మొదటి భార్యకు విడాకులిచ్చిన నిర్మల్ సింగ్, ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ కు చెందిన తార అనే యువతిని నాలుగేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.

వీళ్లద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తార ఇలాంటి ఘోరానికి పాల్పడింది. మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన కొడుకు 14 ఏళ్ల భరత్ సింగ్ చుట్టుపక్కల వాళ్లకి విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. అయితే హత్య చేసిన అనంతరం భరత్ మొబైల్ ఫోన్ ను కూడా తార తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నింధితురాలికోసం గాలిస్తున్న పోలీసులు దర్యాప్తు వేగంగా సాగిస్తున్నారు.

English summary

Wife killed husband in Uttar Pradesh