ఇల్లరికపు అల్లుడి లైంగిక దాడి తట్టుకోలేక భార్య ఏం చేసిందో తెలుసా

Wife Kills Husband In Warangal District

10:34 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Wife Kills Husband In Warangal District

ఇల్లరికంలో ఉన్న మజా ... అంటూ పాత సినిమాలో ఉన్నపాటకు అనుగుణంగా మజా చేస్తూ,అత్తా , మరదళ్లపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని మట్టుబెట్టిన వైనం ఇది. వివరాల్లోకి వెళ్తే, ఒకామెకు భర్త చనిపోయాడు.. ఇంట్లో ఎదిగొచ్చిన ముగ్గురు ఆడపిల్లలు. మగదిక్కు లేకపోవడంతో పెద్దకూతురి కోసం ఇల్లరికం అల్లుడిని తెచ్చుకుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని ఆశపడింది! కానీ ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ అల్లుడు మరదళ్లు, అత్త పైనే లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దాష్టీకాలు ఆపాలని భర్తను వేడుకుంది ఆ భార్య! చంపేస్తానని గొడ్డలిని పైకెత్తాడా కర్కోటకుడు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆమె తిరగబడింది. గొడ్డలిని లాక్కొని భర్తను నరికి చంపేసింది. ఆఖరుకు మృతదేహాన్ని పాతిపెట్టడంలో విఫలమై పోలీసులకు లొంగిపోయింది. సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని జంగేడులో చోటు చేసుకుంది.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం... జంగేడుకు చెందిన రేనుకుంట్ల నర్సయ్య, నిర్మల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నర్సయ్య 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. నిర్మల తన పెద్దకూతురు అనూషకు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండెల నాగరాజు(28)తో పెళ్లి జరిపించి ఇల్లరికం తెచ్చుకుంది. భర్త టోల్ కాంటా పనిని అల్లుడికి ఇప్పించి పెద్ద దిక్కుగా ఉంటాడని ఆశపడింది. కానీ అతడు మద్యానికి బానిసై మరదళ్లతో అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. అంతటితో వదల్లేదు. తల్లిలాంటి అత్తను సైతం లైంగికంగా వేధించసాగాడు.

ఇదే క్రమంలో గత ఆదివారం తెల్లవారుజామున అత్త నిర్మలపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అనూష నిద్రలేచి వారించేందుకు ప్రయత్నించింది. ఆవేశానికి గురైన నాగరాజు దుర్భాషలాడుతూ గొడ్డలితో చంపుతానని బెదిరించగా, అనూష తిరగబడి అదే గొడ్డలితో భర్తపై దాడిచేసి మెడపై నరికింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత తల్లీకూతుళ్లు ఆ శవాన్ని బాతరూంలో పూడ్చి పెట్టాలని నిర్ణయించారు. కొంతమేర గుంతను తవ్వారు. అయితే శవాన్ని పూడ్చటం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే వదిలేసారు. నేరుగా పోలీసులకు లొంగిపోయారు.

ఇవి కూడా చదవండి:దేవుడికి మొక్కు చెల్లిస్తామని చెల్లించకపోతే ఏమౌతుంది?

ఇవి కూడా చదవండి:షాకింగ్: దానికి ఓకే చెప్పిన నిత్యామీనన్!

English summary

A Woman Named Anusha was married to a Man named NagaRaju and they two were living in anusha house with her sisters and mother in law. One Nagaraju used to harass mother in law sexually and they quarreled each other and anusha killed her husband and Capitulated in near by police station.