భర్త పై కోపంతో వేడి నూనె పోసి నరకం చూపించింది

Wife poured hot oil on husband with angry

04:03 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Wife poured hot oil on husband with angry

భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవడితే, మనస్పర్థలు రాజ్యమేలడం సహజం. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం వల్లే గొడవలకు కారణం. వీటిని సకాలంలో పరిష్కరించుకోవాలి, లేదా పెద్దలెవరైనా, బంధు మిత్రులు జోక్యం చేసుకుని సరిదిద్దాలి, లేకుంటే కొంప ముంచుతాయి. సరిగ్గా ముంబయిలో ఓ జంట మధ్య జరిగిన గొడవ ఇలాగే భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. భర్తకు నరకం చూపిస్తోందని సహజంగా అంటూ ఉంటారు. అయితే ఓ ఇల్లాలు నిజంగానే నరకం ఎలా ఉంటుందో... అదేనండి అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో చూపించింది. సాధారణంగా నరకంలో మరుగుతున్న నూనెలో వేయించి శిక్ష విధిస్తారని చెబుతుంటారు. అయితే ఓ భార్య తన భర్తకు బతికుండగానే ఆ శిక్ష విధించేసింది.

ఇది కూడా చదవండి: అంజలి ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయిందిగా...

ఆశ్చర్యం, గగుర్పాటు కల్గించే ఈ ఘటన గురించి వివరాల్లోకి వెళితే... ముంబయిలో నివాసముండే సీతారాం ఖాలే, గీతా ఖాలే భార్యాభర్తలు. ఈ మధ్య తన భర్త తనను పట్టించుకోవడం లేదని, వేరే ఎవరితోనో చనువుగా ఉంటున్నాడని గీతా మనసులో అభిప్రాయం ఏర్పడింది. దీంతో తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా ఈ వ్యవహారం పై వీరిద్దరి మధ్య గొడవ రేగింది. కూతురిని గీతా కొడుతుండగా అప్పుడే ఇంటికి వచ్చిన సీతారాం భార్యను అడ్డుకునే యత్నం చేసాడు, కొట్టవద్దని వారించాడు. అసలే ఆ భార్య భర్తల నడుమ సఖ్యత లేదేమో, ఇక చూసుకోండి... ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది.

ఇది కూడా చదవండి: వేసవిలో త్రాగటానికి ఆరోగ్యకరమైన పానీయాలు

పట్టరాని కోపంతో ఊగిపోయిన గీతా సలసల కాగే నూనెను సీతారాం ఒంటి పై పోసేసింది. దీంతో సీతారాం బిగ్గరగా పెడ బొబ్బలు పెట్టాడు. అతని శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. అతనికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం సీతారాం పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సీతారాం వాంగ్మూలం తీసుకున్నారు. తులింజ్ పోలీస్ స్టేషన్‌లో గీతా పై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసారు. నిజంగానే భర్తకు నరకం చూపించిన ఆ ఇల్లాలు ఇప్పుడు లబోదిబోమంటోంది.

ఇది కూడా చదవండి: డబ్బు వద్దని 13 లక్షలు పడేసింది.. ఎక్కడో తెలుసా?

English summary

Wife poured hot oil on husband with angry. A wife called Geetha Khaale poured hot oil on her husband in Mumbai.