భర్తపై రేప్ కేసు పెట్టిన భార్య

Wife put rape case on Husband

11:05 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Wife put rape case on Husband

ఇది గృహ హింస కేసు కాదు , రేప్ కేసు , స్వయంగా భర్తపై ఓ భార్య పెట్టిన కేసు .. అతడు ఓ పేరున్న నిర్మాత బంధువు. వివరాల్లోకి వెళ్తే, ఈమేరకు బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైంది. ఆ కేసు పెట్టింది అతని భార్య. తన భర్త వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నగలన్నీ తీసుకున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని ఆమె ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా తనను వేధించేవాడని, ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ బలవంతం చేసేవాడని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్న వెర్సోవా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై 376(రేప్), సెక్షన్ 498(ఏ)(భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్మాతకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలన్నీ నిందితుడు చూసుకునేవాడని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇది కూడా చూడండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

English summary

Wife put rape case on Husband. Accused 376 ( rape ), 498 ( a ) ( cruel behavior towards his wife ) has been booked under IPC .