ప్రియురాలికి రీఛార్జి చేయించాడని భార్య ఆత్మహత్య

Wife suicide for husband recharge to his lover

09:45 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Wife suicide for husband recharge to his lover

ఇప్పటి వరకు భర్త భార్య పై అనుమానంతో వదిలేయడం, లేక చంపేయడం లాంటివి చూశాం. కానీ ఇప్పుడు భార్య భర్త పై అనుమానంతో చనిపోవడం చూడబోతున్నాం. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం బూరాన్ పూర్ ప్రాంతానికి చెందిన నీరుడు సుధాకర్ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాప్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అనూష(27) అనే మహిళతో రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం. బీటెక్ చదివిన అనూష పెళ్లికి ముందు ఉద్యోగం చేసింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఉద్యోగం మానేసి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది.

అయితే.. గత కొంతకాలంగా అనూష భర్త సుధాకర్ అతని స్నేహితుడి చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనూషకి అనుమానం కలిగింది. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు తలెత్తేవి. రెండు రోజుల క్రితం ప్రియురాలి సెల్‌ ఫోన్‌‌కు రీఛార్జి చేయించడంతో.. గురువారం భార్యాభర్తల మధ్య గొడవ తారా స్ధాయికి చేరింది. ఈ సంఘటనతో భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానం ఆమెను వెంటాడింది.. అతడు ఆఫీసుకి వెళ్లగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిని చూసిన ఆ ఇంటి ఓనర్ జరిగిన విషయాన్ని సుధాకర్‌ కు ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో పోలీసులకు కూడా సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary

Wife suicide for husband recharge to his lover