యువతిని నగ్నంగా ఫోటోలు తీసి లోబరచుకుంటే.... భార్య సహకరించిందట(వీడియో)

Wife supported for husband brutal mind

03:01 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Wife supported for husband brutal mind

ఛ ఛ.. అభం శుభం తెలియని అమ్మాయిలను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ, లోబరుచుకునే ప్రబుధ్ధులు దీనికి సహకరించే ఆడాళ్ళు కూడా వుంటున్నారు. అంతగా సమాజం దిగజారిపోయింది. ఇదే తరహాలో యువతికి మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి బెధిరించి అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం కలిగించింది. ఇద్దరు దంపతులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టడంతో గ్రామస్థులు వాపోయారు. ఆచంటకు చెందిన నెక్కంటి శ్రీను, సుశీల దంపతులు వారి ఇంటి పక్కన ఉంటున్న 22 ఏళ్ళ యువతితో పరిచయం పెంచుకున్నారు.

ఆమెను ఇంటికి తీసుకొచ్చి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. మత్తులో ఉన్న ఆమెను నగ్నంగా ఫోటోలు తీశారు. ఫోటోలు చూపి శారీరక కోర్కెలు తీర్చాలని బెధిరించి నెక్కంటి శ్రీను ఆమెను 15 నెలలుగా అనుభవిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా బయటపెడితే ఫోటోలను బయట పెడతానని శ్రీను బెధిరించడంతో బాధితురాలు తనలో తనే కుమిలిపోయింది. ఇటీవల ఆ ఫోటోలను మిత్రులకు, బంధువులకు పోస్టుచేస్తానని బెధిరించినట్లు బాధితురాలు వాపోయింది. ఇటీవల శ్రీను మిత్రులు నలుగురిని తీసుకువచ్చి వారికి సుఖాన్ని కూడా పంచాలని డిమాండ్ చేశాడు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని ఆమె నిశ్చయించుకుంది. ఇంట్లో సూసైడ్ నోట్ ను రాయడాన్ని తల్లిదండ్రులు గమనించారు. దారుణం గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలకొల్లు సీఐ కె.చంద్రశేఖర్ శుక్రవారం ఆచంట వచ్చి స్వయంగా కేసు విచారించారు. హత్యాయత్నం, నిర్భయ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు శ్రీను ఇంట్లో కంప్యూటర్ పరిశీలించి విజువల్స్ ను, ఫోటోలను స్వాధీనం పరచుకున్నట్లు చెబుతున్నారు.

English summary

Wife supported for husband brutal mind