వైఫై స్ప్రింటర్లతో వాటర్ సేవ్..!

Wifi Sprinkler That Save Water

03:49 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Wifi Sprinkler That Save Water

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య నీరు. సరైన వర్షాలు పడక.. కోట్లాది మంది తాగునీటికి కటకటలాడిపోతున్నారు. ఇక పంటలు ఎండిపోయి రైతన్నలు దిగాలుపడుతున్నారు. అందుకే భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే నీటిని ఆదా చేయడం ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని గుర్తించిన అమెరికాలోని డెన్వర్‌కు చెందిన రషియో సంస్థ వైఫైతో నడిచే స్మార్ట్‌ స్ప్రింక్లర్ల వ్యవస్థను రూపొందించింది. ఇవి 30 శాతం నీటిని ఆదా చేస్తాయట. స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఈ వ్యవస్థను నియంత్రించవచ్చు. స్ప్రింక్లర్‌ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తారు. నియంత్రణకు సంబంధించిన యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తారు. దీంతో ఇంటి వద్ద నుంచే వీటిని నియంత్రించడం సాధ్యమవుతుంది. దీని సాయంతో సీజన్ల వారీగా నీటిని విడుదల చేయవచ్చు. వాతావరణాన్ని పరిశీలించి వర్షం వస్తే దానంతట అదే ఆగిపోతుంది. భూమిలో నీరు ఇంకిన శాతం గమనిస్తుంది. ఆవిరి కాగానే మళ్లీ నీటిని విడుదల చేస్తుంది. 2012లో అమెరికాలోని కొలరాడోలో వచ్చిన కరవును చూసి చలించిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు క్రిస్‌ క్లెయిన్‌, ఫ్రాన్జ్‌ గార్సోంబ్కే ఈ వైఫై స్ప్రింక్లర్లను ఆవిష్కరించారు.

English summary

A new water sprinkler invented that saves water by 30 percent.This water sprinkler can be controlled with the use of our smart phone