ఇక వికీపీడియా సెర్చ్‌ఇంజన్‌

Wikipedia to launch New Search Engine

10:31 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Wikipedia to launch New Search Engine

ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తరహాలో సెర్చ్ ఇంజన్ ను రూపొందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియా సిద్ధమైంది. ‘నాలెడ్జ్‌ ఇంజన్‌ బై వికీపీడియా’ పేరుతో ఈ ప్రాజెక్టును వికీపీడియా ప్రారంభించనుంది. ఈ కొత్త ప్రాజెక్టు కోసం వికీపీడియాకు చెందిన జాన్‌ ఎస్‌ అండ్‌ జేమ్స్‌ ఎల్‌ నైట్‌ ఫౌండేషన్‌ 2,50,000 డాలర్ల నిధులను మంజూరు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు సులభంగా శోధించగలిగే సౌకర్యం, విశ్వసనీయ సమాచారం అందజేయాలని వికీపీడియా భావిస్తోంది. వికీపీడియా మొదట్లో గూగుల్‌ తరహా సెర్చ్‌ఇంజన్‌ ప్రాజెక్టుపై పనిచేయడం లేదని చెప్పింది. కానీ వికీపీడియా ఫౌండేషన్‌ ఈ వారం ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నిధులతో వికీపీడియా ఆరు నెలల పాటు వినియోగదారుల సెర్చింగ్‌ అలవాట్లపై లోతుగా పరిశీలన, పరీక్షలు, సెర్చ్‌ హ్యాబిట్స్‌పై ప్రొటోటైప్స్‌, ప్రాక్టీసెస్‌ చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఇతర వికీపీడియా ప్రాజెక్టులపైనా పనిచేస్తామని వెల్లడించింది.

English summary

Worlds Popular Wikipedia to launch a new search engine called "Knowledge Engine By Wikipedia".