ఎన్టీఆర్‌, కృష్ణ వందో సినిమాల్లా బాలయ్య నిలుస్తాడా?

will balakrishna get 100th film hit as like his father ntr and superstar krishna

07:03 PM ON 20th November, 2015 By Mirchi Vilas

will balakrishna get 100th film hit as like his father ntr and superstar krishna

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్‌'. ఆ తరువాత 100వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. హీరోగా 100 సినిమాలు చెయ్యాలంటే అంత చిన్న విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని నిలబడాలి. తమ చిత్రాలతో ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చెయ్యాలి. హీరో రేంజ్‌ను కాపాడుకోవాలి. నిన్నటి తరంలో ఎంతో మంది 100 సినిమాలు మైలురాయిని దాటిన వాళ్లున్నారు. కానీ ఇప్పటి తరం వాళ్లు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అంటే 100 సినిమాలు మైలురాయిని అందుకోవడం వీళ్లకి సాధ్యమేనా?

ఏ హీరోకైనా ఎన్ని సినిమాలు తీసినా 100వ సినిమా ఏ ప్రత్యేకం. సచిన్‌ ఎన్ని సెంచరీలు చేసినా వందో సెంచరీ కోసమే అందరూ ఎదురుచూశారు. అలాగే హీరోల 100వ సినిమా ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ వందో సినిమా హిట్‌ కొట్టి వారి సరసన నిలుస్తాడా అన్న సందిగ్ధ నెలకొంది. హీరోలు ఎన్ని సినిమాలు చేసినా వాళ్ల కెరీర్లో 25వ సినిమా, 50వ సినిమా, 100వ సినిమా, 150వ సినిమాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలనే గుర్తుంచుకుంటారు. అందుకే మన హీరోలు కూడా 100వ చిత్రానికి సంబంధించిన కథ-డైరెక్టర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో 100 సినిమాలు నటించి వందో సినిమా తీపి జ్ఞాపకంగా మిగుల్చుకున్న హీరోలు ఇద్దరే ఉన్నారు. ఒకరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుగారు, తన 100వ చిత్రం 'గుండమ్మ కథ', కుటుంబ కథతో చక్కటి దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రం టాప్‌ 10 క్లాసిక్‌ హిట్స్‌లో ఈ చిత్రం నిలిచిపోయింది. ఇంకొకరు సూపర్‌స్టార్‌ కృష్ణగారు. తన 100వ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఈ చిత్రం కృష్ణ 100వ చిత్రంగానే సూపర్‌హిట్‌ కాదు కృష్ణగారి కెరీర్‌లోనే ఒక మరపురాని మైలురాయిలా నిలిచిపోయింది.

ఇప్పుడు బాలకృష్ణ 100వ చిత్రానికి 'గాడ్‌ ఫాదర్‌' అనే టైటిల్‌ను చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను రిజిస్టర్ చేయించుకున్నారు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ ఎంతటి సూపర్‌హిట్‌ విజయాలు సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రాల్లాగానే బాలకృష్ణ 100వ చిత్రం 'గాడ్ఫాదర్' సూపర్‌హిట్‌ అయ్యి తండ్రి సరసన నిలవాలని కోరుకుందాం...

English summary

will balakrishna get 100th film hit as like his father ntr and superstar krishna