గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లికి బిజెపి నేతలు వెళ్తారా లేదా?

Will BJP leaders go to Gali daughter's marriage are not

12:24 PM ON 15th November, 2016 By Mirchi Vilas

Will BJP leaders go to Gali daughter's marriage are not

ఓపక్క పెద్ద నోట్ల రద్దు, మరోపక్క ఓబుళాపురం గనుల రారాజు గాలి జనార్ధన రెడ్డి ఇంట్లో పెళ్లి... రెడ్డి గారి కుమార్తె పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాలిజనార్దన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ నేతలందరినీ పేరుపేరునా తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. కొందరికైతే స్వయంగా వెళ్ళి ఆహ్వాన లేఖలు అందజేశారు. వివాహ వేడుకలు బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపధ్యంలో పెద్దనోట్లు రద్దు చేసి అవినీతిపై కేంద్రం యుద్ధం చేస్తున్న బిజెపి ఎలా వ్యవహరిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

1/3 Pages

ఇలాంటి సమయంలో ఎలాంటి వివాదాలకు తావులేనివిధంగా వ్యవహరించాలని ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు హాజరు కావద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకు సోమవారం ఫోన్ చేసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary

Will BJP leaders go to Gali daughter's marriage are not