బల్లిని చంపితే... పాపం చుట్టుకుంటుందా?!

Will hindus can kill Lizards

11:12 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Will hindus can kill Lizards

అవునా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే, బల్లిని చూసి చాలామంది భయపడుతుంటారు. కెవ్వున కేక పెడతారు. బల్లిని చూస్తే భయంతోనూ, జుగుప్సతోనూ వణికిపోతారు. ఇలాంటి సమయంలో బల్లిని కనుక చంపేస్తే, మీకు పాపం చుట్టుకున్నట్లే. బల్లి సర్పజాతికి చెందిందని దానిని చంపితే శాపానికి గురవకతప్పదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దేవుళ్లలో ముక్కంటి మెడచుట్టూ, వినాయకుడి పొట్టచుట్టూ, మహావిష్ణువుకు నాగశయ్యగా సర్పం మారింది కదా. అలాంటి నాగజాతికి చెందిన బల్లిని చంపితే, దాని శాపానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

సర్పానికి, మనిషికి ఆదికాలం నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఇంకా సర్పజాతికి చెందిన బల్లిని చంపడం ద్వారా పాపం అనుభవించకతప్పదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మానవాళిని శపించగల శక్తి మహర్షులు, దేవుళ్లకు తర్వాత సర్పజాతికే ఉందని అంటారు. అందుకే సర్పజాతికి చెందిన బల్లిని చంపడం కూడదని వారు సూచిస్తున్నారు. పాపానికి గురయ్యేందుకు ఎవరూ సిద్ధంగా వుండరు కదా మరి.

English summary

Will hindus can kill Lizards