గూగుల్‌ స్ట్రీట్‌వ్యూకు అనుమతి దక్కేనా..

Will Indian Government Gives Permission To Google Street View

04:53 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Will Indian Government Gives Permission To Google Street View

దేశంలోని వివిధ నగరాల్లోని ప్రధాన వీధులు, పర్యాటక స్థలాలను అన్నికోణాల్నించీ కంప్యూటర్‌ తెరపై చూపించే గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూకు కేంద్రప్రభుత్వం అనుమతి లభించకపోవచ్చని సమాచారం. రక్షణ శాఖతోపాటు నిఘా సంస్థలు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర హోంశాఖ.. రక్షణ శాఖ అభిప్రాయాన్ని కోరింది. స్ట్రీట్‌వ్యూ ప్రతిపాదనను గూగుల్‌ ప్రతినిధులు గతేడాది ఏప్రిల్‌లో కేంద్రానికి సమర్పించారు. పర్యాటకం, విపత్తు నిర్వహణ పరంగా స్ట్రీట్‌వ్యూ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. అధునాతన కెమెరాలతో వివిధ నగరాల ఫొటోలు తీసి స్ట్రీట్‌వ్యూలో పెడతామని గూగుల్‌ జులైలో కేంద్రాన్ని కోరింది. అయితే.. దీనికి రక్షణ శాఖ, నిఘాసంస్థలు అంగీకరించటం లేదు. స్ట్రీట్‌వ్యూను గూగుల్‌ 2007లో అమెరికాలో ప్రారంభించి పలుదేశాలకు విస్తరించింది.

English summary

Google representatives in 2015 made a presentation on Street View for the MHA. “They told officials that this platform was useful for tourism and disaster management.".The Indian Government is unlikely to allow Internet giant Google’s Street View service in India because of some internal problems