రవితేజ ని పక్కకు నెట్టి నాగ్ నటిస్తాడా??

Will Nagarjuna accept the Raviteja rejected movie

04:28 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Will Nagarjuna accept the Raviteja rejected movie

మాస్ మహరాజ్ రవితేజ నటించబోయే ఎవడో ఒకడు చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని స్టార్ హీరో నాగార్జున తో తెరకెక్కించాలని చూస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' విజయంతో జోష్ మీదున్న నాగ్తో దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం రూపొందించాలని భావిస్తున్నడట. దాదాపు అదే నేపధ్యంతో తో అక్కడక్కడ కొన్ని మార్పులు, చేర్పులు చేసి నాగార్జున తో దీన్నితెరకెక్కించబోతున్నాడని సమాచారం. అయితే రవితేజకు నచ్చని కథ నాగ్ కి నచ్చుతుందా, మార్పులు చేసినంత మాత్రాన నాగ్ ఈ చిత్రానికి ఓకే చెప్పేస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ సందేహ పడుతున్నారు.

ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ భక్తిరస చిత్రం చేసేందుకు నాగ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఒప్పుకుంటాడా లేదా అనేది తెల్యాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary

Will Nagarjuna accept the Raviteja rejected movie. This movie want to produce Dil Raju but story was not finalised.