పవన్  మాటలేనా ... చేతలు ఉంటాయా?

Will Pawan Fight On Central Government Over Special Status To AP

09:47 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Will Pawan Fight On Central Government Over Special Status To AP

ఏపీ కి ప్రత్యేక హోదాపై రాష్టానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్రంతో పోరాడాలని జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు కదా,మరి ఈయన కూడా కార్యరంగంలో దూకుతాడా లేదా అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకంటూ కేంద్రమంత్రి రాజ్యసభలో వ్యాఖ్యానించడం,ఇక బిజెపి నేతలు కూడా ఆదిశగా వ్యాఖ్యలు చేస్తినట్లు వచ్చిన వార్తల పై స్పందించిన పవన్ .. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి:ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

కాంగ్రెస్ చేసిన తప్పులనే బిజెపి కూడా చేస్తోందని ఫైర్ అయ్యాడు పవన్ ... ఒకసారి గతం పరిశీలిస్తే, మోడీ ప్రధాని అయ్యాక పవన్ కొన్ని సార్లు ఆయనతో భేటీ అయ్యారు. మరి..నేతలిద్దరి మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయో తెలియదు... కానీ ఈ అంశం మాత్రం ఓ కొలిక్కి రాలేదు..అత్యంత ప్రధానమైన స్పెషల్ స్టేటస్ విషయంలో బిజెపి తన వైఖరిని సూటిగా చెప్పకుండా కప్పదాటు వేస్తోంది. దీనిపై పవన్ మళ్ళీ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికలనాటికి తన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పటిష్ట పరచి ఎన్నికల బరిలో దిగే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎలా ముందుకు వెళ్తారన్నదే అసలు పాయింట్. మరో వైపు..ఓటు సాయం చేసి చంద్రబాబును గద్దె నెక్కించిన పవన్..మరి ఈ విషయమై కనీసం నేరుగా బాబుతోనైనా మాట్లాడుతారా..? దీనిపై వీళ్ళిద్దరూ కలిసి కూచుని మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరికీ వాళ్ళే సెపరేటుగాస్టేట్ మెంట్స్ ఇవ్వడంతోనే సరిపోతోంది.ఇప్పటికైనా పవన్ ఓ నిర్దిష్ట వ్యూహంతో ముందడుగు వేస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కార్యరంగంలో దూకుతాడా ?

ఇవి కూడా చదవండి:మా చుట్టాలు వెళ్ళడం లేదంటూ పోలీస్ కేసు పెట్టాడు

ఇవి కూడా చదవండి:భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

English summary

One of the Central Cabinet Minister was said that there is no need of Special Status for Andhra Pradesh. Pawan Kalyan also opposes that Minister words and he gave message to TDP Party to fight Against Central BJP Govt for Special Styatus. NOw a question that will pawan kalyan also will fight for Special status or not.