జనసేన అధినేత నిరాహార దీక్షకు దిగుతాడా?

Will Pawan Kalyan do niraharadeeksha

05:50 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Will Pawan Kalyan do niraharadeeksha

ఇప్పటికే ఇటు అభిమానులకు, అటు పొలిటికల్ లీడర్స్ కి షాక్ ఇస్తూ, తిరుపతిలో సభకు నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంటాడని అంటున్నారు. నేటి సాయంత్రం తిరుపతిలో సభ నిర్వహిస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా గురించి కూడా తన కార్యాచరణ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఇదే ఎజెండాగా మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. తిరుపతి సభలో పవన్ ఏం మాట్లాడతాడోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమాని హత్యపై ఉద్వేగానికి లోనైనా పవన్ ఆ నేపథ్యంలోనే ఈ సభ పెడుతున్నాడని, కచ్చితంగా ఫ్యాన్స్ కు దిశానిర్ధేశం చేస్తాడని కొందరి వాదన.

అయితే ఇంకొందరి వాదన మాత్రం మరోలా వుంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ పవన్ ప్రసంగం సాగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న నెటిజన్లు మాత్రం పవన్ ప్రసంగాలకే పరిమితమైతే ప్రయోజనం లేదని, ప్రత్యేక హోదాపై నిరాహార దీక్ష చేస్తేనే ప్రజలు అతనిని నమ్మే పరిస్థితి ఉందని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. పవన్ కూడా ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని పలుమార్లు తప్పుబడుతూ వచ్చారు. కేంద్రం అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. పవన్ కు సన్నిహితంగా ఉండే అభిమానులు కూడా అధినేతను దీక్ష చేయమని కోరారట.

పవన్ ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ స్పందించలేదు. మరి జనసేన అధినేత ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తారా? లేక ప్రసంగంతోనే ముగిస్తారా అనే విషయం మరికొద్ది గంటల్లో స్పష్టం కానుంది. మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పైనే ఉండడం విశేషం. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిన పవన్ ఇక ఎలాంటి ముగింపు ఇస్తాడో మరి.

ఇది కూడా చదవండి: ప్రపంచ సినీ శ్రీమంతులు... వీరి ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇది కూడా చదవండి: పవన్ స్పీచ్ కోసం కవిత తహ తహ!

ఇది కూడా చదవండి: వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం!

English summary

Will Pawan Kalyan do niraharadeeksha