పాములు నిజంగా పగ పడతాయా?

Will Snakes go for revenge

01:03 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Will Snakes go for revenge

పాములు పగపడతాయని మనం చాలాసార్లు వినే ఉంటాం. వాటిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అవి తప్పించుకుంటే అప్పుడు మన మీద పగ పడతాయని, ఇన్ని రోజులని అవి గడువు పెట్టుకుంటాయని, ఆ టైం లోపు చంపలేకపోతే అవే తల గడపకేసి కొట్టుకుని చనిపోతాయని చాలా సార్లు విని ఉంటాం. అయితే ఇదంతా నిజామా? లేక మూఢ నమ్మకమా అని తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత అది తప్పించుకుపోతే అది మిమ్మల్ని పగబడుతుందని, మీరు కొట్టే సమయంలో ఆ పాము మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుందని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందని మన పెద్దలు చెప్తారు.

పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగపడుతుందా? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? అనే విషయాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిజమేంటంటే.. పాముకు అసలు ఏమీ గుర్తుకు ఉండదట.. అలాంటప్పుడు పాము మనల్ని గుర్తు పెట్టుకునే ఛాన్స్, పగపట్టే ఛాన్స్ అసలు ఉండనే ఉండదట.! ఇదంతా మనవాళ్లు కల్పించిన ఓ మూఢ నమ్మకం మాత్రమేనట.! అయితే దీని వెనుక కూడా ఓ కారణం ఉందనే అంటారు చాలామంది. అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయమని మనందరికీ తెలుసు.

పండించిన పంటలకు ఎలుకల నుండి తీవ్ర నష్టం వాటిల్లేదట. కాబట్టి కనపడిన పామును కనపడినట్టు చంపడం ద్వారా.. ఎలుకలను తినే పాముల సంఖ్య తగ్గడంతో.. ఎలుకలు విపరీతంగా పెరగడం.. పంటలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లడం లాంటివి అవుతాయని.. ముందస్తుగా పాములను చంపొద్దు, ఒకవేళ మిస్ అయితే అవి పగబడతాయి అనే భయాన్ని క్రియేట్ చేసారట. పురాతాన జనాలు పామును దేవతగా కొలవడం, ప్రకృతి ప్రేమికులు కావడం కూడా దీని వెనుకున్న అసలు కారణాలట.

ఇది కూడా చదవండి: పవన్ ఎస్.జె. సూర్యను తీసేసి డాలీని ఎందుకు పెట్టుకున్నట్టు?

ఇది కూడా చదవండి: వామ్మో.. ఇదేంటంటూ మధ్యలోనే పారిపోయిన హీరోయిన్

ఇది కూడా చదవండి: హీరో నానిని కమల్ తో పోల్చేసింది

English summary

Will Snakes go for revenge