ఓన్లీ ఫర్ విండోస్‌ 10

Windows 10 Supportable Processors

03:59 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Windows 10 Supportable Processors

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్త మైక్రోసాఫ్ట్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్‌ వినియోగదారులందరినీ.. విండోస్‌10కి మారేలా చేసేందుకు.. విండోస్‌10తోనే పనిచేసే ప్రాసెసర్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది అత్యాధునిక ఫీచర్లతో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలోనే దాదాపు 22 కోట్ల మంది విండోస్‌10కు మారారు. దీంతో విండోస్ 10 ఎంటర్‌ప్రైజ్‌.. ఎడ్యుకేషన్‌ ఎడిషన్లను మరింత విస్తరించాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. అందుకు అన్ని ఫీచర్లను సపోర్ట్‌ చేసే ప్రాసెసర్లను తయారు చేసేందుకు ఇంటెల్‌.. ఏఎండీ.. ఎన్‌వీడియా.. క్వాల్‌కామ్‌ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టెర్రీ మియెర్సన్‌ వెల్లడించారు. త్వరలో రానున్న ఇంటెల్‌ కబీ లేక్‌, క్వాల్‌కామ్‌ 8996, ఏఎండీ బ్రిస్టల్‌ రిడ్జ్‌ సిలికాన్‌ ప్రాసెసర్లు విండోస్‌10ను మాత్రమే సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఇంటెల్‌ స్కైలేక్‌ ప్రాసెసర్లు కలిగి ఉన్న కంప్యూటర్లు మరో 18 నెలలు(17, జూలై 2017 వరకు) మాత్రమే విండోస్‌7, విండోస్‌8.1 ఓఎస్‌లను సపోర్ట్‌ చేస్తాయని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలిపింది. ఆ తర్వాత అందరూ విండోస్‌10కి తప్పక మారాల్సి ఉంటుందట.

English summary

MIcrosoft Company said that All next-generation processors built by Intel, AMD, Qualcomm, or others, will only support Windows 10 operating system.