డ్రాప్‌బాక్స్‌ నుంచి విండోస్ హలో!

Windows Hello Feature From Drop Box

04:13 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Windows Hello Feature From Drop Box

అంతర్జాతీయంగా క్లౌడ్‌ సేవలు అందించే డ్రాప్‌బాక్స్‌ సంస్థ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విండోస్‌ హలో ఫీచర్‌తో లాగిన్‌ అయ్యే సదుపాయంతో కంప్యూటర్లు.. స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలోనూ పనిచేసే యూనివర్సల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి పాస్‌వర్డ్‌ అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్‌ ఫీచర్‌తో డ్రాప్‌బాక్స్‌ తెరవొచ్చు. విలువైన ఫైళ్లను భద్రంగా దాచుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘విండోస్‌ 10’ ఆపరేటింగ్‌ సిస్టంలో కొత్తగా విండోస్‌ హలో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో విండోస్‌ ఫోన్‌.. కంప్యూటర్‌లోకి కెమెరా ముందు ముఖాన్ని చూపించి లాగిన్‌ అవ్వొచ్చు. టెక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సదుపాయం ఇప్పుడు విండోస్‌ 10 వెర్షన్‌ డ్రాప్‌బాక్స్‌ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాస్‌వర్డ్‌తో పనిలేకుండా.. ముఖంతోనే లాగిన్‌ కావొచ్చు. అయితే కెమెరా సదుపాయం లేని కంప్యూటర్‌ వినియోగదారులు పాస్‌వర్డ్‌లను వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ తాజా బయోమెట్రిక్‌ ఫీచర్‌ ద్వారా డ్రాప్‌బాక్స్‌లోని ఫైళ్లకు భద్రత మరింత మెరుగవుతుందని చెబుతున్నారు.

English summary

Dropbox has bring its new feature called Windows Hello Support that enables users to sign in to their Dropbox accounts by using their fingerprint, face or iris.