మజా.. మజా.. వైన్ వెండింగ్ మెషీన్

Wine Wending Machine

03:53 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Wine Wending Machine

టీ.. కాఫీ.. కోసం టీకొట్టుకు వెళ్లడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు టీ, కాఫీల కోసం వెండింగ్ మెషీన్లు కూడా వచ్చేశాయి. బటన్ నొక్కితే వేడి వేడి టీ కప్పుతో రెడీ అయిపోతుంది. ఇదంతా మాకు తెలిసిందే కదా అంటారా.. అక్కడికే వస్తున్నా.. మీరు టీ వెండింగ్ మెషీన్.. కాఫీ వెండింగ్ మెషీన్ గురించి విన్నారు.. మరి వైన్ వెండింగ్ మెషీన్ గురించి మీకు తెలుసా..? తెలియదా..! అయితే 'డీ-వైన్' గురించి మీకు చెప్పాల్సిందే.. ఫ్రాన్స్‌కు చెందిన 10విన్స్‌ అనే స్టార్టప్‌ డీ-వైన్‌ పేరుతో ఓ వైన్ వెండింగ్ మెషీన్‌ని రూపొందించింది. దీనిని అమెరికా లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్-2016లో ప్రదర్శనకు ఉంచింది. ఈ మెషీన్‌ ద్వారా వైన్‌ను కావాల్సిన ఉష్ణోగ్రతతో సిద్ధం చేసుకోవచ్చు. వైన్‌ రుచి మారకుండా సరైన టెంపరేచర్‌తో గ్లాస్‌లోకి వచ్చేలా ఈ మెషీన్ ను రూపొందించారు. దీనిలో పెట్టడానికి వీలుగా ఉండే 10 సెంటీలీటర్‌ క్యాప్సుల్స్‌ కూడా సిద్ధం చేశారు. ఈ క్యాప్సుల్‌ను మెషీన్‌ పైభాగంలో పెడితే అది వైన్‌ను మెషీన్‌లోకి పంపిస్తుంది. తర్వాత కావాల్సిన టెంపరేచర్‌తో కింద పెట్టిన గ్లాస్‌లో వైన్‌ పడుతుంది. ఇంకేముంది ఛీర్స్‌ చెప్పుకుని చక్కా తాగేయడమే..

English summary

Now in this fast moving life there were soo many new things were invented. There were coofe and tea wendng machines, now rencently a company invented a wine wending machines which provides chilled beer in just minutes