అతని ప్రాణాలు తీసిన అద్భుత సాహసం(వీడియో)

Wingsuit jumper Armin Schmieder died in great adventure

11:28 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Wingsuit jumper Armin Schmieder died in great adventure

జీవితంలో ఎదో సాధించాలనే తపన బలంగా ఉంటే మనిషి ఎంతకైనా తెగిస్తాడు. ఒక్కోసారి ప్రాణం మీదికి వస్తుంది కూడా. సరిగ్గా అలాంటి విషాద ఘటనే ఇది. తన వింగ్ సూట్ జంప్ ని ఇతరులతో పంచుకోవాలనుకున్నాడు ఓ ఇటాలియన్ పైలట్. సోషల్ మీడియాలో వేదికగా లైవ్ ప్రసారం చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఇటాలియన్ పైలట్ ఆర్మిన్ షూమిడర్. సాహసాలు చేయడం అతడికి హాబీ. ఇదేక్రమంలో స్విట్జర్లాండ్ లోని ఓ ఎత్తైన పర్వతం పైనుంచి ఎలాంటి సేఫ్టీ లేకుండా అడ్వెంచర్ కు ప్లాన్ చేశాడు. అంతేకాదు సాహసానికి ముందు 'టుడే ఫ్లై విత్ మి' అంటూ పోస్టు కూడా పెట్టాడు.. అనుకోకుండా మృత్యువాతపడ్డాడు.

దీంతో ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులు దీన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతడికి అభిమానులు సందేశాలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్మిన్ చనిపోయాడని నిర్థారణకు వచ్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు కాండెర్ స్టెగ్ సమీపంలోని ఓ జంపింగ్ లొకేషన్స్ లో అతడి మృతదేహం లభ్యమైనట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని అంటున్నారు. సాహసాలు ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తాయో అంతకంటే విషాదాన్ని మిగుల్చుతాయి. అందుకు ఎగ్జాంఫుల్ ఈ వీడియో! ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ, ఈ సాహసికి నివాళులర్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

ఇది కూడా చదవండి: గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఇది కూడా చదవండి: పేమెంట్ తీసుకోని రియల్ హీరోస్

English summary

Wingsuit jumper Armin Schmieder died in great adventure