17నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 

Winter Season Assembly Seasons To Start On Dec 17

03:24 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Winter Season Assembly Seasons To Start On Dec 17

ఎపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17న ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు జరిగే సమావేశాలలో సభా సమయాన్ని ప్రతి ఒక ఎంఎల్ఏ సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు కోరారు. సభా సమయం వృధా చేస్తే , ప్రజా దానం వృధా అవుతుందని ఆయన అన్నారు. అయితే ఎపికి ప్రత్యేక హోదా , రాజధాని భూసేకరణ , చిత్తూరు - నెల్లూరు - కడప - ప్రకాశం జిల్లాల్లో వరద బీభత్సం , గోదావరి జిల్లాల్లో వానలకు పంట నష్టం తదితర అంశాలపై వాడీ వేడీ చర్చ జరిగే అవకాశం వుందని చెప్పవచ్చు విజయవాడ కృష్ణ లంకలో కల్తీ మద్యం సేవించి 8 మంది మరించడం , పలువురు అస్వస్తకు గురికావడం నేపద్యంలో కల్తీ మద్యం గురించి గట్టిగానే చర్చ జరిగే అవకాశం వుంది. . విజయవాడలోనే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని గతంలోనే స్పీకర్ ప్రకటించారు. మరి ఈ సమావేశాలలో ఏమి జరగబోతోంది.

English summary

Winter Season Assembly Seasons To Start On December 17th and ends at december 22nd. Speaker kodela siva prasad said that each and every MLA in andhra pradesh have to participate in this winter season sessions