ఐఫోన్‌లకు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

Wireless Charging For iPhone Users

10:19 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Wireless Charging For iPhone Users

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ తన ఐఫోన్లలో సరికొత్త ఫీచర్లను జత చేయనుంది. యాపిల్‌ 2010లో ఐమ్యాక్‌ కంప్యూటర్‌ క్లౌడ్‌ సర్వర్‌ నుంచి 1 మీటర్‌ దూరంలో ఉంచిన డివైజ్‌లకు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ చేయడం ద్వారా ఈ తరహా టెక్నాలజీపై పేటెంట్‌ పొందింది. దీనిని మరింత అభివృద్ధి చేసి ఛార్జర్‌ అవసరం లేకుండా ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకునేలా నూతన టెక్నాలజీని అమెరికా, ఆసియా దేశాల్లోని తన భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేస్తోంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, సాంసంగ్‌లకు చెందిన కొన్ని మోడళ్ల మొబైల్‌ ఫోన్లు ఇప్పటికే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ డాక్‌ సదుపాయం కలిగి ఉన్నాయి. వీటికి ఉన్న పరిమితుల దృష్ట్యా యాపిల్‌ తన నూతన ఆవిష్కరణలో వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే యాపిల్‌ ఐఫోన్‌, ఐపాడ్‌లు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగా యాపిల్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ద్వారా దూరం పెరిగే కొద్దీ విద్యుత్‌ నష్టం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. ఈ టెక్నాలజీతో మానవుల ఆరోగ్యానికి ఎంతమేరకు హాని కలుగుతుందనే దానిపైన పరిశోధనలు చేస్తోంది. 2017లో యాపిల్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.

English summary

Apple Company will provide wireless charging feature on upcoming iPhones.Apple is said to be working on wireless charging technology.This latest technology to be launched in 2017