వంచినా విరగని...  పుస్తకం మాదిరి ఫోన్ ...

Wireless flexible smartphone

02:48 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Wireless flexible smartphone

ఒకప్పుడు ఫోన్ అంటే అదో ఖరీదైన, పెద్దవాళ్ళ అలంకార ప్రాయంగా వుండేది. మొబైల్ విప్లవంతో ప్రతిచేతికి ఫోన్ వచ్చేసింది. రకరకాల మొబైల్స్ , స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేసాయి. ఇంకా వస్తూనే వున్నాయి . తక్కువ రేటుకే మొబైల్ ఫోన్ ఆఫర్ కూడా వచ్చేసింది. ఇక కిందపడినా పగలదు.. వంచినా విరగదు. అలాంటి వినూత్నమైన మొబైల్ వచ్చేస్తోంది. ఒక పుస్తకంలో పేజీలను ఎలా తిప్పుతామో ఆ ఫోన్‌లోనూ పేజీలను అలా తిప్పుతూ చదువుకోవచ్చట. ఇక దానికోసం ఫోన్‌ తెర మీద వేళ్లను కదపాల్సిన పనిలేదు. ఫోన్‌ను కాస్త వంచితే చాలు. పేజీ ఈజీగా మారిపోతుందట.ఎంత బలంగా వంచుతామో అందుకు అనుగుణంగా పేజీలు అంత వేగంగా మారుతాయి. పుస్తకపఠనంలోనే కాదు.. వీడియోగేమ్‌ల విషయంలోనూ అంతే. ఫోన్‌ను కుడి/ ఎడమవైపు వంచుతూ గేమ్‌ను ఆడుకోవచ్చు. వీడియోగేమ్‌లో వస్తువులు కూడా అంతవేగంగా కదులుతాయి. దీనివల్ల పుస్తకాన్ని ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని చదివినట్లుగా కాకుండా.. ప్రత్యక్షంగా చేతుల్లో పట్టుకొని చదివిన అనుభూతి కలుగుతుందని, వీడియోగేమ్‌ మరింత సహజంగా ఉంటుందని దీని రూపకల్పనకు సారథ్యం వహించిన రాల్‌వెర్టిగాల్‌ అంటున్నారు. కెనడాలోని క్వీన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హ్యూమన్‌ మీడియా ల్యాబ్‌ డైరెక్టర్‌ వెర్టిగాల్‌. ఈయన నేతృత్వంలోనే కొత్తరకం స్మార్ట్‌ఫోన్‌ తయారైంది. దీనికి రిఫ్లెక్స్‌ అనే పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే తొలి వైర్‌లెస్‌ ఫ్లెక్సిబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ గా ఆయన అభివర్ణించారు. ఫోన్‌ను ఎంతబలంగా వంచామన్నది తెరవెనుక ఉండే సెన్సర్లు గ్రహించి.. దానికి తగినట్లుగా తెర మీద మార్పులను చూపుతాయని వెర్టిగాల్‌ చెబ్తున్నారు. మరి మార్కొట్లో విడుదలైతే ఈ మొబైల్ కి భలే గిరాకీ ...

English summary

Researchers at Queen's University's Human Media Lab have developed the world's first full-colour, high-resolution and wireless flexible smartphone to combine multitouch with bend input. The phone, which they have named ReFlex.This flexuble smartphone allows users to feel the buzz by bending their apps.