పాపం , దానికి కక్కుర్తి పడింది - కెమెరాకు దొరికేసింది

Woman Arrested For Theft Welcome Board

11:10 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Woman Arrested For Theft Welcome Board

ఏమిటి అనుకుంటున్నారా, మాంచి ఇంట్రెస్టింగు స్టోరీ ఇది. ఓసారి వివరాల్లోకి వెళదాం. నలుగురికి తమ ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది కోరుకోవడంలో తప్పులేదు. ఇందుకోసం ఇంటిముందుభాగంలో రకరకాల అలంకారాలు చేసుకుంటారు కూడా... కానీ, అలాంటి అందమైన అలంకారాలను కూడా దొంగలించే దొంగలు కూడా ఉంటారని ఈ ఘటన చెబుతోంది. తాజాగా అమెరికాలో ఓ 30 ఏళ్ల మహిళ ఇలాంటి కక్కుర్తి పనే చేసి, అడ్డంగా బుక్కయింది. ఓ ఇంటి ముందుభాగంలో ఉన్న 'వెల్ కమ్' బోర్డును, అమెరికా జెండా వస్త్రంతో చేసిన పూలడిజైన్ ను దొంగలించింది.

పాపం చాలా తెలివిగా ఎవరికంట పడకుండా వాటిని దొంగిలించానని ఆమె తెగ మురిసిపోయింది. కానీ, నిఘా కోసం పెట్టిన రహస్య కెమెరాల్లో ఆమె అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో జరిగింది. నిందితులరాని కార్లే విలియమ్స్ గా గుర్తించారు. ఆమె ఓ ఇంటి ముందున్న 'వెల్ కమ్' బోర్డును, పూల డిజైన్ ను దొంగలించడం.. సీసీకెమెరాల్లో రికార్డయింది. దీంతో నిందితురాలని గుర్తించిన పోలీసులు ఆమె చిల్లర దొంగతనానికి పాల్పడిందని అభియోగాలు నమోదుచేశారు.

ఆమె ఇంట్లో నుంచి దొంగలించిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంటి ముందు ఆవరణలో ఉంచే పలు వస్తువులను ఆమె దొంగలించిందని పోలీసులు గుర్తించారు. ఎవరూలేని సమయం చూసి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం ఆమె అలవాటుగా పోలీసుల విచారణలో తేలింది. సీసీకెమెరా వీడియో ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి సహకరించిన సోషల్ మీడియాకు అలాగే మీడియాకు పోలీసులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

English summary

A Woman caught red handedly by CC Tv Camera and she caught by theft of welcome board and some house decorating items.