పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

Woman Climbs Cell Tower In Tanuku Due To Police Harassment

09:54 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Woman Climbs Cell Tower In Tanuku Due To Police Harassment

పోలీసుల ఆగడాలు కొన్నిచోట్ల మరీ మితిమీరుపోతున్నాయని అనిపించేలా కొన్ని సంఘటనలు ఉంటున్నాయి. తాజాగా ఖాకీల క్రూరత్వం ఇక భరించలేనంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకునేందుకు సిద్దపడింది. పిరియడ్స్ టైంలో కూడా రాత్రనక పగలనకా విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు రమ్మని పదేపదే వేధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు కు చెందిన సదరు యువతి తనకు వేధింపులు ఆపకపోతే కిందికి దూకేస్తానంటూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపింది.

ఇవి కూడా చదవండి:సెగలు పట్టిస్తున్నఊపిరి బ్యూటీ(ఫోటోలు)

తన తమ్ముడు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని అతని ఆచూకీ కోసం చాలా చోట్ల గాలించామని చెప్పింది. ఆరోజు మధ్యాహ్నం మూడింటి వరకూ తమ్ముడు తనతోనే ఉన్నాడని, తర్వాత నాయనమ్మతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపింది. అయితే, పోలీసులు విచారణంటూ స్టేషన్ కు రమ్మని రాత్రి వరకూ పోలీస్ స్టేషన్లో ఉంచుతున్నారని, పెళ్లికావాల్సిన తనను ఇలా వేధిస్తే ఎవరు పెళ్లిచేసుకుంటారని ప్రశ్నించింది. పోలీసులు, మీడియా సహా అక్కడివారంతా నచ్చచెప్పడంతో మొత్తానికి ఆ యువతి కిందకి దిగింది. గొడవ సర్దు మణిగింది.


ఇవి కూడా చదవండి:

ప్రభాస్ పెళ్ళి ఆమెతోనేనట

ఫేస్బుక్ ప్రియుడు కోసం పోలీసు భర్తనే చంపేసింది!

కత్తిలాంటోడు ఫస్ట్ లుక్

English summary

A Woman in Tanuku in Andhra Pradesh climbs Cell Phone tower and attempted to suicide . She said that police were harassing her even she was in periods time.